రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఈవిఎం వేర్ హౌస్ ను తనిఖీ చేసిన రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్

రేణిగుంట,  నేటి పత్రిక ప్రజావార్త :
రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఈవిఎం వేర్ హౌస్ ను రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌస్ నందు ఏర్పాటు చేసిన ఈవిఎం వేర్ హౌస్ ను ఆం.ప్ర సిఈఓ గారు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిఈఓ గారు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ మరియు ఈవీఎం నోడల్ అధికారి కోదండ రామిరెడ్డి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈవిఎం వేర్ హౌస్ వద్ద 24X7 భద్రత ఏర్పాట్లు, సీసి కెమెరా పర్యవేక్షణ తదితర ఏర్పాట్ల పట్ల సిఈఓ గారు సంతృప్తి వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *