అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ సీఎం చంద్రబాబు రేపు (సోమవారం) తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతి శ్రీ సిటీలోని పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆయా సంస్థల ద్వారా రూ.900 కోట్ల పెట్టుబడితో 2,740 మందికి ఉపాధి లభించనుంది. మరో 1,213 కోట్ల పెట్టుబడికి ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. రేపటి పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు శ్రీ సిటీ బిజినెస్ సెంటర్ లో పలు కంపెనీల సీఈవోలతో సమావేశం కానున్నారు. కాగా, చంద్రబాబు రేపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనూ పర్యటించనున్నారు. ఇక్కడి సోమశిల ప్రాజెక్టును సందర్శించనున్నారు. సోమశిలలో వరదలకు దెబ్బతిన్న కట్ట పనులను పరిశీలించనున్నారు.
Tags amaravathi
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …