రేపు నగరంలో ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్ అవగాహన సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖ ఆద్వర్యంలోని ఆర్థిక సేవల విభాగం వారి ఆదేశానుసారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఆద్వర్యంలో మంగళవారం విజయవాడ, తుమ్మల పల్లి కళాక్షేతంనందు ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్ అవగాహన సదస్సు నిర్వహించబడుతుంది. ఈ అవగాహన సదస్సు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి కన్వీనర్ సి వి ఎన్ భాస్కరరావు ఆద్వర్యంలో రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల సహకారంతో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి వివిధ శాఖలకు చెందిన కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి అధికారులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల లబ్ధిదారుల కొరకు మరియు అవగాహన సదుస్సుకి విచ్చేసే ప్రజల కొరకు స్టాల్ల్స్ ని  ఏర్పాటు చేయటం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమం ద్వారా లబ్ది పొందాలను కానే ప్రజలందరూ పాల్గొని ఈ అవగాహన సదస్సును జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నామని జనరల్ మేనేజర్ & రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి కన్వీనర్ సి వి ఎన్ భాస్కరరావు ఓ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *