-ఆనందంలో మహదేవపల్లి గ్రామస్తులు
పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత జోక్యంతో మహదేవపల్లి గ్రామస్తుల రహదారి కష్టాలు తీరాయి. స్థానిక రైల్వే బ్రిడ్జి అండర్ పాస్ వద్ద శిథిలమైన రహదారిని మరమ్మతులు చేసి, తాత్కాలిక రహదారిని ఆర్ అండ్ బి అధికారులు నిర్మించారు. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తమవుతోంది. మంత్రి సవితమ్మ చొరవ వల్లే రహదారి కష్టాలు తీరాయని గ్రామస్తులు సంతోషం వక్తంచేస్తున్నారు. రొద్దం మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తను పరామర్శించడానికి మంత్రి సవిత ఆదివారం వెళ్లిన విషయం విధితమే. మార్గమధ్యంలో మహదేవపల్లి రైల్వే అండర్ పాస్ రహదారి పూర్తి శిథిలమైన మోకాలు లోతు వర్షపు నీరు నిల్వ ఉండడం గమనించిన మంత్రి…ఆర్ అండ్ బి అధికారులతో తక్షణమే నీటిని తోడి, తాత్కాలిక రహదారి నిర్మించాలని ఆదేశించారు. కేవలం మాటలతోనే సరిపెట్టకుండా… దగ్గరుండి రహదారిపై నిలిచిపోయిన వర్షపు నీటిని మంత్రి సవితమ్మ తోడించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆర్ అండ్ బి అధికారులు శిథిమైన రహదారిపై ఎం శ్యాండ్ మట్టిని కప్పి.. తాత్కాలిక రహదారిని నిర్మించారు.