Breaking News

వెనుకబడిన వర్గాలకు విద్య, వైద్యం, ఆరోగ్యం అందించడంలో సాంఘిక సంక్షేమ శాఖ పనితీరు కీలకం

-గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
-ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలి, విద్యార్థులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి
-త్వరలో ఎస్సీ విద్యార్థులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ
-సెప్టెంబర్ మొదటివారం నుంచి అన్ని జిల్లాల్లో పర్యటిస్తా
-మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వెనుకబడిన వర్గాలకు విద్య, వైద్యం, ఆరోగ్యం అందించడంలో సాంఘిక సంక్షేమ శాఖ పనితీరు కీలకమని ఉద్యోగులు బాధ్యతతో పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సోమవారం నాడు గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వర్క్ షాప్ , సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….. గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యతివ్వాలి. నాయుడుపేట గురుకుల పాఠశాలలో పరిశుభ్రత లేమి కారణంగా బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థుల అనారోగ్యానికి గురయ్యారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కావడానికి వీలు లేదు. గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో ప్రతి నెల హెల్త్ చెకప్ లు నిర్వహించాలి.ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలి, విద్యార్థులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. అధికారులు తరచుగా తనిఖీలు నిర్వహించాలి. రిమోట్ ఏరియాల్లోని గురుకుల పాఠశాలల్లో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని నియమిస్తాం. జిల్లా కేంద్రాల్లో ఎస్సీ విద్యార్థులకు మూడు నెలల పాటు ఉచితంగా డీఎస్సీ శిక్షణ అందిస్తాం. అంబేద్కర్ ఓవర్సీస్ విదేశీ విద్యతో పాటు గత టిడిపి ప్రభుత్వ హయాంలో అమలైన ఎస్సి సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం. ఏ సౌకర్యాలు లేని రోజుల్లోనే కష్టపడి చదివి అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ మహనీయులయ్యారు.
ప్రతి హాస్టల్లో అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ ఫొటోలుండాలి, వారి స్ఫూర్తిని ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేయాలి.
ఉద్యోగులు కష్టపడి పనిచేసి మెరుగైన ఫలితాలు తీసుకురావాలి. అవసరమైనచోట సచివాలయ ఉద్యోగుల సహకారం తీసుకోండి. ఉద్యోగులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఎస్సీల్లో తలసరి ఆదాయం పెంచేలా అధికారులు ప్రణాళికల రూపొందించాలని అన్నారు. వచ్చే నెల మొదటి వారం నుంచి అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, మోడల్ విలేజెస్ పరిశీలిస్తానని మంత్రి అన్నారు.

అనంతరం వంద రోజుల యాక్షన్ ప్లాన్ ని మంత్రికి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
రాష్ట్రంలోని 1051 హాస్టల్స్ లో 86 వేల సీట్లలో 32 వేల సీట్లు ఖాళీలు ఉన్నాయని వాటిని సెప్టెంబర్ లోగా భర్తీ చేస్తామన్నారు. గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో రూ.143 కోట్లతో మైనర్, మేజర్ రిపేర్లు చేయాల్సి ఉందన్నారు..ప్రతి వసతి గృహంలో 6 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్థామన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, ఎన్టీఆర్ విద్యోన్నతి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజెస్స్కీం, బుక్ బ్యాంకు టీం వంటి పథకాలన్నీ పునరుద్ధరిస్తామన్నారు. గత ఐదేళ్లలో హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు కూడా అందించలేదని, వాటిని తిరిగి విద్యార్థులకే అందిస్తామన్నారు. రూ.190 కోట్లతో గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో డార్మెటరీలు కిచెన్లు పునర్నిర్మానం చేయాల్సి ఉందన్నారు. కొన్నిచోట్ల నాన్ టీచింగ్ స్టాఫ్ ని భర్తీ చేయాల్సి ఉందన్నారు. నరేగా నిధులతో గురుకులాల్లో కాంపౌండ్ వాల్స్, మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టి. కన్న బాబు, ఆంద్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసన్న వెంకటేష్, అన్ని జిల్లాల సాంఘిక సంక్షేమ అధికారులు, ఎస్సి కార్పోరేషన్ అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *