కలుషిత ఆహారంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ఉన్నత స్ధాయి విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం

-విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ తో మాట్లాడిన సీఎం
-బాధిత విద్యార్థుల కుటుంబసభ్యులు, సంరక్షులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. బాధిత విద్యార్థుల కుటుంబసభ్యులు, సంరక్షులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అనాథాశ్రమంలో కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటనలో ముగ్గరు చనిపోయారు. పలువురు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో ఫోన్లో మాట్లాడిన సిఎం చంద్రబాబు ఘటన వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న వైద్య సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని మంత్రి లోకేష్ కు సూచించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు తరువాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *