గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వెలిగొండ ప్రాజెక్టు పనులు ఆలస్యం

-అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే ఆ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసే చర్యలు చేపట్టాం
-అధికారుల అంచనా మేరకు రెండేళ్లు కాకుండా సంవత్సరంలోనే పనులు పూర్తి చేసేందుకు చర్యలు
-ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలంటే దాదాపు రూ.4 వేల కోట్లు అవసరం
-జలవరుల అభివృద్దికి తమ హయాంలో రూ.68 వేల కోట్లు వెచ్చిస్తే, గత ప్రభుత్వ హయాంలో కేవలం రూ.19 వేల కోట్లు మాత్రమే వెచ్చించడం జరిగింది
-రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వెలిగొండ ప్రాజెక్టు పనులు ఆలస్యమైనాయని, తాము అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే ఆ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసే చర్యలు చేపట్టడం జరిగిందని రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అధికారుల అంచనా మేరకు రెండేళ్లు కాకుండా ఒక సంవత్సరంలోనే ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలంటే దాదాపు రూ.4 వేల కోట్లు అవసరమని ఆయన తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకుంటూ వెలిగొండ ప్రాజెక్టు ఆలస్యానికి తమ ప్రభుత్వమే కారణమంటూ నిందలు వేయడాన్ని ఖండించారు. జలవరుల అభివృద్దికి గతంలో తమ హయాంలో రూ.68 వేల కోట్లు వెచ్చిస్తే, గత ప్రభుత్వ హయాంలో కేవలం రూ.19 వేల కోట్లు మాత్రమే వెచ్చించడం జరిగిందని ఆయన విమర్శించారు.

తమ ప్రభుత్వం అధికారంలోని వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజక్టు పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒక సంవత్సంలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశాన్ని పరిశీలించమని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ప్రకాశం జిల్లాకు త్రాగు,సాగు నీటిని సాద్యమైనంత త్వరగా అందించే విధంగా యుద్ద ప్రాతిపధకన చర్యలు చేపట్టడమైందన్నారు. వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ పనులు, మొదటి, రెండవ టన్నల్ లైనింగ్ పనులు, ఫీడర్ కెనాల్ స్ట్రక్చర్, లైనింగ్ పనులకు మరియు నిర్వాశితులకు ఆర్ అండ్ ప్యాకేజీ కై మొత్తం 4 వేల కోట్లు వెచ్చించాల్సి ఉందన్నారు. ఇందుకై స్టేజ్-1 లో రూ.1,422 కోట్లు, స్టేజ్-2 లో రూ.2,157 కోట్లు మరియు ఫీడల్ కెనాల్ స్ట్రక్చర్, లైనింగ్ పనులకు రూ.400 కోట్లు వెరసి మొత్తం రూ.4 వేల కోట్లు వెచ్చించి యుద్ద ప్రాతిపదిక పనులను నిర్వహించేందుకు చర్యలు చేపట్టడమైందన్నారు.

వెలిగొండ ప్రాజెక్టు పెండింగ్ పనులను ఆయన వివరిస్తూ వెలిగొండ ప్రాజెక్టు ప్రాథమిక టన్నల్ హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండా నీటిని వదిలితే టన్నల్ కే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంటుంది అనే కనీస పరిజ్ఞానం లేకుండా వెలిగొండ ప్రాజెక్టుకు నీళ్లు వదల వచ్చు అని మాజీ ముఖ్యమంత్రి అనడం ఎంతో హాస్యాస్పదంగా ఉందన్నారు. మొదటి టన్నల్ కు సంబందించి 500 మీటర్లు, రెండవ టన్నల్ కు సంబందించి 7 కి.మి. లైనింగ్ పూర్తి కాకుండానే నిర్థేశించిన నీటి పరిమాణాన్ని వదలడం సాధ్యం కాదు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో గత ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. రెండవ టన్నల్ లో త్రవ్విన 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని మొదటి టన్నల్ చివరి భాగాన వేయడం జరిగిందని, ఆ మట్టిని తొలగించ కుండా నీటిని విడుదల చేయడం సాద్యం కాదనే కనీస పరిజ్ఞానం కూడా మాజీ ముఖ్యమంత్రి కి లేదని ఆయన విమర్శించారు. రెండవ టన్నల్ 12 వ కి.మి. దగ్గర ఉన్న టన్నల్ బోరింగ్ మిషన్ చెడిపోయి ఉంటే గత మూడు సంవత్సరాలుగా బయటకు తీసువచ్చే కనీస ప్రయాత్నాన్ని గత ముఖ్యమంత్రి చేయకపోగా, ఇప్పుడు ఆ టి.బి.ఎం.ను బయటకు తీసుకు రాకుండా ఏ విధంగా నీరు వదలగలం అని ప్రశ్నించారు. రెండవ టన్నల్ కు సంబందించి ఇంకా 30 శాతం బెంచింగ్ పనులు నిర్వహించాల్సి ఉందని, అందుకు 50 వేల నుండి లక్ష క్యూబిక్ మీటర్ల రాతి వ్యర్థాలను తొలగించాల్సి ఉందన్నారు. ఇందుకు బ్లాస్టింగ్, డ్రిల్ చేసుకుంటూ నిదానంగా నిర్వహించాల్సి ఉందని, ఎంతో సమర్థవంతంగా పనిచేస్తే ఆరు మాసాలు కాకుంటే సంవత్సర కాలం ఈ పనికి పడుతుందన్నారు. అటు వంటి పనిని గత ఐదు సంవత్సరాల్లో ఏమాత్రం నిర్వహించకుండా ఇప్పుడు మాపై నిందనలు వేయడం ఏమాత్రం సబబని ఆయన ప్రశ్నించారు. వీటితో పాటు 22 కి.మి. ఫీడర్ కెనాల్ లైనింగ్, విస్తరణ పనులు కూడా పూర్తి స్థాయిలో జరుగలేదన్నారు. మొదటి టన్నల్ ద్వారా 3 వేల క్యూసిక్కులు, రెండవ టన్నల్స్ ద్వారా 8,500 క్యూసిక్కులు వెరసి మొత్తం 11,500 క్యూసెక్కు నీరు ప్రవహించే సామర్థ్యం ఆ ఫీడర్ కెనాల్ కు లేదన్నారు. అదే విధంగా ఫీడర్ కెనాల్ ద్వారా 53 టి.ఎం.సి.ల సామర్థ్యం గల నలమల సాగర్ రిజర్వాయరుకు నీరు చేరుకుంటుదని, అయితే ప్రస్తుతం ఆ రిజర్వాయరులో అర టి.ఎం.సి. నీటిని నిల్వచేసే అవకాశం కూడా లేదన్నారు. ఈ నలమల సాగర్ రిజర్వాయరు వల్ల 11 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ క్రింద నిర్వాశితులకు దాదాపు రూ.1,100 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో కనీసం కోటి రూపాయలు కూడా చెల్లించలేదన్నారు.

2021 జూలై 15 వ కేంద్ర జలవనరుల శాఖ హంద్రీనివా, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను అప్రూవుడ్ ప్రాజెక్టులుగా పేర్కొంటూ, వెలిగొండను అన్ అప్రూవుడ్ ప్రాజెక్టుగా గజిట్ జారీచేస్తే గత ముఖ్యముంత్రి తన వ్యక్తిగత స్వార్థం కోసం నోరుమెదపలేదని ఆయన తప్పుపట్టారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులకు గ్రీజు కూడా పెట్టలేకపోయిందని, గేట్లు కొట్టుకుపోయాయని, సోమశిల ప్రాజెక్టు గేట్లు, షట్టర్లు రోప్స్ తుప్పు పట్టిపోయేలా చేశారని, నీరు నిండితే సోమశిల ప్రాజెక్టు గేట్లు మూస్తే గేట్లు కొట్టుకుపోతాయేమోననే ఆందోళన మాకుందని, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు కూడా సరిగా లేకపోవడానికి కారణం గత ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆయన తప్పుపట్టారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *