యూనియన్‌ బ్యాంకు ‘‘యూ’’ జీనియస్‌ జాతీయ స్థాయి క్విజ్‌ పోటీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, జోనల్‌ ఆఫీస్‌ విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ మేరిస్‌ స్టెల్లా కళాశాల ఆడిటోరియలో ‘‘యూ’’ జీనియస్‌ పేరుతో జాతీయ స్థాయి క్విజ్‌ పోటీలను నిర్వహించినట్లు యూబీఐ చీఫ్‌ మేనేజర్‌ కె.జయశ్యామ్‌ తెలిపారు. శుక్రవారం జరిగిన ఈ క్విజ్‌ పోటీలల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 450 పాఠశాలల్లో ఎనిమిది నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 1200 మంది పాల్గొన్నారన్నారు. స్పెషల్‌ క్విజ్‌ మాస్టర్‌ వివిధ రౌండ్ల ద్వారా విద్యార్థులను ఫిల్టర్‌ చేసి ఫైనల్‌ రౌండ్‌లో పాల్గొనే చివరి 5 జట్లకు, ఐదు జట్ల నుంచి తుది విజేతలను యుబిఐ నిర్వహించే ముంబైలో జరిగే జాతీయ స్థాయి క్విజ్‌కు పంపుతారని మరియు విజేతకు రూ.2.00 లక్షల ప్రైజ్‌ మనీ ఇవ్వబడుతుందన్నారు. ముఖ్య అతిథిగా ఎన్టీఆర్‌ జిల్లా ఆరోగ్య సేవ ముఖ్య కార్యనిర్వహణాధికారి లక్ష్మీషా విచ్చేసి విద్య యొక్క ప్రాముఖ్యతతోపాటు జీవితంలో ప్రతివిద్యార్థి సాధించే లక్ష్యం గురించి వివరించారు. జనరల్‌ మేనేజర్‌, జోనల్‌ హెడ్‌, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ సీవీఎన్‌.భాస్కరరావు, డిప్యూటీ జోనల్‌ హెడ్‌ శారదమూర్తి, ఎం.శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *