Breaking News

ది మెడికల్ ప్రాక్టీషర్స్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కార్యవర్గం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ది మెడికల్ ప్రాక్టీషర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తిరుపతి, హోటల్ రిగాలియా లో ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో 2024 నుండి 2027 సంవత్సరం కి నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అసోసియేషన్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా యస్. వి. ఆయుర్వేదిక్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, గత 17 సంవత్సరం ల నుండి తిరుపతి లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న, డా. బి. రాకెష్ కుమార్ ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షుడు గా ఉన్న డా. వేముల భాను ప్రకాష్ అధ్యక్ష పదవీ భాద్యతలు నూతన అధ్యక్షుడు కి అందచేస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డా. బి. రాజేషకుమార్ మాట్లాడుతూ నేడు ఆయుర్వేదం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆసక్తి, కృషి కారణం. కేంద్రప్రభుత్వం ఆయుష్ అభివృద్ధికి ఏర్పాటు చేస్తున్న చట్టాలు, పథకాలు ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లో ఆలసత్వం లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ని కోరారు. దక్షిణ భారత దేశంలో మన రాష్ట్రంలో తప్ప అన్ని రాష్ట్రాల్లో ఆయుర్వేద వైద్యులు క్లినిక్స్, హాస్పిటల్స్ ఏర్పాటుకు అవసరమైన క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ఉందని,మన రాష్ట్రంలో ఈ చట్టం ఏర్పాటుకు అసోసియేషన్ కృషి చేస్తున్నది అన్నారు. నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ చట్టం2020 ప్రకారం రాష్ట్రంలో స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ ను సెప్టెంబర్ 2023 లోగా ఏర్పాటు చేయాలి.కానీ జరుగలేదు. గత ప్రభుత్వం ఆయుర్వేద అభివృద్ధిని పూర్తి గా నిర్లక్ష్యం చేసింది. అసోసియేషన్ ఈ సమస్యలపై ఆరోగ్య శాఖా మాత్యులు సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకొని వెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి యుద్ధప్రాతిపదికన వాటి పరిష్కారానికి అధికారులు తో చర్చించి ముసాయిదా బిల్లులను త్వరలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టడానికి సిద్ధపడడం హర్షణీయం.
కేంద్రప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం సహకారంతో మన రాష్ట్రంలో ఏర్పాటు చేసిన విలేజ్ క్లినిక్స్ లో ఆయుర్వేద గ్రాడ్యుయేట్ లకు అవకాశం పై మంత్రి అధికారులు నుండి నివేదిక కోరడం జరిగింది. తెలంగాణా లో మాదిరి మన రాష్ట్రంలో ఆయుర్వేద వైద్యులకి విలేజ్ క్లినిక్స్ లో అవకాశం ఇస్తే ప్రజలకి ఆరోగ్యం వైద్యుని ద్వారా అందుతుంది. ఆయుష్మాన్ భారత్ పథకం లో ఆయుష్ వైద్యాలకు స్థానం కలిపించడానికి కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ప్రతిపాదనలు ని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఇటీవల కేంద్ర ఆయుష్ సహాయమంత్రి ప్రకటించడం తెలిసిందే. ఇది అమలులోకి వస్తే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం ఆయుర్వేదం కి వర్తించే అవకాశం కలుగుతుంది. ఈ దిశగా అసోసియేషన్ కృషి చేస్తామన్నారు. నేషనల్ ఆయుష్ మిషన్ పథకం ద్వారా రాష్ట్రంలో ట్రైబల్ ఆయుర్వేదిక్ మొబైల్ యూనిట్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినందున త్వరలోనే కేరళ తరహాలో మన రాష్ట్రంలో ఈ పథకం అమలులో కి వస్తుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని ఈ. ఎస్. ఐ హాస్పిటల్స్ వారి మార్గదర్శకాల ప్రకారం ఆయుష్ యూనిట్స్ ఏర్పాటు పై ప్రభుత్వం దృష్టి సారించాలి. మెడికల్ ఆఫీసర్స్ పోస్ట్స్ భర్తీలో జరుగుతున్న జాప్యం పై ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్యుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కి ఆన్ లైన్ విధానం ప్రారంభించడానికి సిద్ధం చేయడం మంచి పరిణామం.
మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఉన్న ఆయుర్వేద డిస్పెన్సరీస్ లను కొనసాగించాలని కోరారు. తన పదవీ కాలంలో ఆయుష్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం కి అసోసియేషన్ పరంగా సహకారం అందిస్తూ ఎప్పటికప్పుడు సమస్యలు ని వారి దృష్టికి తీసుకొని వెళ్లి ఆయుర్వేద వైద్యులు, వైద్య విధానం కొరకు పని చేస్తాను అని, ఆరోగ్య సంరక్షణ లో ఆయుర్వేదం ని ప్రాధమిక వ్యవస్థ గా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు కోసం అసోసియేషన్ తరుపున కృషి చేస్తానన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన అసోసియేషన్ చైర్మన్ డా.వేముల భాను ప్రకాష్ కి, కార్యవర్గ సభ్యులు మరియు సభ్యులు అందరికి ధన్యవాదాలు తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *