-టైక్వాండోలో బంగారం,వెండి మోత మోగించిన ఎర్రం శెట్టి సిస్టర్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏషియన్ టైక్వాండో ఛాంపియన్షిప్ విజేతలు గా ఇండియా కు చెందిన ఎర్రంశెట్టి శృతి బంగారు పతకం సాధించగా ఎర్రశెట్టి జశ్విత వెండి పతకం సాధించి టైక్వాండో వినిలీకాశంలో భారత దేశ జండాను ఏగరవేశారు.ఏషియన్ టైక్వాండో ఛాంపియన్ షిప్ 2024 టైక్వాండో పోటీలను మూడు రోజులపాటు విజయవాడ చెన్నుపాటి రామకోటయ్య స్టేడియంలో నిర్వహించారు. ఈ పోటీలలో 13సంవత్సరాల బి కేటగిరీలో బాలికల విభాగంలో 45 కేజీలు విభాగంలో విజయవాడ కు చెందిన ఎర్రం శెట్టి శృతి గోల్డ్ మెడల్,ఎర్రం శెట్టి జశ్విత సిల్వర్ మెడల్ సాధించారం.అనంతరం ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ డాన్ డెల్టాన్ చేతుల మీదుగా మెడల్స్ స్వీకరించారు.ఎర్రం శెట్టి సిస్టర్స్ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం పట్ల టైక్వాండో కార్యదర్శి డివివి ప్రసాద్ అభినందించారు.అనంతరం ఇంటర్నేషనల్టై టైక్వాండో ఇండియా గ్రాండ్ మాస్టర్ బి.వి.రమణయ్య ఈ చిన్నారుల ఇద్దరినీ అభినందించారు.ఎర్రం శెట్టి సిస్టర్స్ తండ్రి న్యాయవాది రాజా కూడ గతంలో టైక్వాండో లో జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించడం గమనార్హం.