Breaking News

చవితి పందిళ్ళ ఏర్పాటుకు అన్‌లైన్‌ అనుమతి తప్పనిసరి…

-రసాయన రహిత వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయండి..
-చవితి పందిళ్ళ నిర్వహణలో భద్రత చర్యలను పాటించండి..
-జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినాయక చవితి పండుగా సందర్భంగా జిల్లాలో వినాయక పందిళ్ళు ఏర్పాటు చేసే నిర్వహకులు తప్పనిసరిగా అన్‌లైన్‌ ద్వారా అనుమతి పొందాలని, సాద్యమైనంత మేరకు రసాయన రహిత విగ్రహాలను ఏర్పాటు చేసుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లతో చవితి పందిళ్ళను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన సంబంధిత అధికారులకు సూచించారు.

వినాయక చవితి పందిళ్ళ నిర్వహణ, విగ్రహాల నిమజ్జన ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన మంగళవారం కలెక్టరేట్‌ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నగర పోలీస్‌ కమీషనర్‌ ఎస్‌.వి. రాజశేఖర్‌ బాబుతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా జిల్లాలో పందిళ్ళను ఏర్పాటు చేసి వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అనవాయితీగా వస్తుందన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకునేందుకు చవితి పందిళ్ళను ఏర్పాటుచేసే నిర్వహకులు అన్‌లైన్‌ ద్వారా మాత్రమే పోలిస్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పందిళ్ళ ఏర్పాట్లకు నిర్వహకులు అన్‌లైన్‌ ద్వారా చేసుకున్న ధరఖాస్తులను పోలీస్‌, అగ్నిమాపక, నగర పాలక సంస్థ, విద్యుత్‌ శాఖ అధికారులు పరిశీలించి నిబంధనల మేరకు అనుమతి మంజూరు చేయాలన్నారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునేందుకు కానీసం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసుకుని వారి వివరాలు గుర్తింపు కార్డులను అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పందిళ్ళు విగ్రహాల ఏర్పాటుకు ప్రైవేట్‌ స్థలమైతే స్థల యాజమాని నుండి, ప్రభుత్వ స్థలం అయితే సంబంధిత పంచాయతీ మున్సిపల్‌ అధికారుల అనుమతి పొంద వలసి ఉంటుందన్నారు. ఏర్పాటు చేసే విగ్రహాం ఎత్తు బరువు ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య నిమజ్జనం మార్గం ఉపయోగించే వాహన వివరాలను ముందుగానే పొందుపరచాలన్నారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల మాత్రమే సౌండ్‌ బాక్స్‌లను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంత మేరకు మట్టి విగ్రహాలు లేదా రసాయన రహిత విగ్రహాలను ఏర్పాటు చేసుకునేలా నిర్వహకులు ప్రోత్సహించాలన్నారు. పందిళ్లలో గణేష్‌ విగ్రహాలను ఏర్పాటు చేసుకుని ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకోనేలా చర్యలు తీసుకోవాలన్నారు. పందిళ్లు వద్ద ఎటువంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. పందిళ్లలో ఏర్పాటు చేసే విద్యుత్‌ అలంకరణ వలన షార్ట్‌ సర్కూట్‌లకు తావులేకుండా తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్‌ విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. నిమజ్జనం ప్రాంతాల వద్ద గజ ఈతగాళ్లను సిద్దంగా ఉంచాలని మత్స్య శాఖ అధికారులను, ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్యఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

నగర పోలీస్‌ కమీషనర్‌ రాజశేఖర్‌ మాట్లాడుతూ గత ఏడాది జిల్లాలో 2328 విగ్రహాలు, నిమజ్జనం చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది గణేష్‌ ఉత్సవాల సందర్భంగా పందిళ్లను ఏర్పాటు చేసుకునే నిర్వహకులు అన్‌లైన్‌ ద్వారా అనుమతి పొందాలని సూచించడం జరిగిందన్నారు. పందిళ్ల వద్ద పోలీస్‌ పహర ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పందిళ్లలో అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్వహకులకు సూచించాలని అధికారులను ఆదేశించారు. భద్రత కొరకు రాత్రి సమయంలో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్‌ కమిటీ ప్రతినిధులు కాపాల ఉండేలా చర్యలు తీసుకోవాలి. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా మండపాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన ప్రదేశాలలో క్రేయిన్‌లను ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద నిమజ్జనం సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిమజ్జనానికి ఏర్పాటు చేసిన ప్రదేశాలలోనే కాకుండా కాలువలు నదీ పరివాహక ప్రాంతాలలో విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశాలు ఉంటాయని అటువంటి ప్రదేశాలను ముందుగానే గుర్తించి పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌, కార్పొరేషన్‌ తదితర శాఖల అధికారులు సమన్వయంతో వినాయక చవితి పందిళ్ళ ఏర్పాటు నిమజ్జనం కార్యక్రమాలలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీస్‌ కమీషనర్‌ కోరారు.

సమావేశంలో డిసిపిలు గౌతమి శాలి, కె.యం మహేశ్వరావు, కె. చక్రవర్తి, ఎసిపి కె. వెంకటేశ్వరరావు, జిల్లా రెవిన్యూ అధికారి వి. శ్రీనివాసరావు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఇఇ శ్రీనివాసరావు, అగ్నిమాపక అధికారి ఎ.వి. శంకర్‌రావు, విజయవాడ, తిరువూరు, నందిగామ ఆర్‌డివోలు బి.హెచ్‌ భవానిశంకర్‌, కె. మాధవి, ఎ. రవీంద్రరావు, నగర పాలక సంస్థ అడిషనల్‌ కమీషనర్‌ కె. మహేష్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *