Breaking News

ట్రిపుల్ ఐటి విద్యార్ధులకు మెరుగైన వైద్యం అందించాలి

-సంఘటన పై విచారణ జరిపి సమగ్ర నివేదిక అందించాలి
-రాష్ట్ర గృహనిర్మాణం,సమాచార పౌర సంభందాల శాఖ మంత్రి ఆదేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నూజివీడు ట్రిపుల్ ఐటి లో చదువుతున్న విద్యార్ధులు అనారోగ్యం పాలు అవుతుండడం పై రాష్ట్ర గృహనిర్మాణం సమాచార పౌర సంభందాలు శాఖ మంత్రి స్పందించారు.ట్రిపుల్ ఐటి కళాశాల అధికారులతో మాట్లాడి అనారోగ్యానికి గల కారాణాల ఫై వివరాలు అడిగి తెలుసుకున్నారు.సంస్థ లొ చదువుతున్న విద్యార్ధులు అందరికి అవసరమైన వైద్య పరిక్షలు చేయించాలని,అనారోగ్యానికి గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.విషయం తెలిసిన వెంటనే మంత్రి ట్రిపుల్ ఐటి రిజిస్ట్రార్ ఇతర అధికారులతో మాట్లాడి విద్యార్ధులకు ఏవిధమైన ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని,వారి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించవద్దని,ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ అనారోగ్యానికి గల కారణాల పై విచారణ జరిపి సమగ్రమైన నివేదికను తక్షణం అందించాలని మంత్రి ఆదేశాలు జారీ చేసారు.తక్షణం నుజీవీడు ట్రిపుల్ ఐటి కి వెళ్లి విద్యార్ధులకు అందుతున్న వైద్యం,విద్యార్థులు అనారోగ్యానికి గురి కావడానికి గల కారణాల ఫై ఆరా తీయాలని ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మంత్రి ఆదేశించారు.మంత్రి ఆదేశాలు మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీమతి సెర్మిష్ట నూజివీడు ట్రిపుల్ ఐటి కి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. కళాశాలలో అపరిశుభ్రత లేకుండా చూడాలని మంత్రి పార్ధసారధి గారు ఆదేశించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *