శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరు జడ్జీల ప్రమాణం

-ఇద్దరు శాశ్వత న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
-జడ్జిలతో ప్రమాణ స్వీకారం చేయించిన సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్‌ వెణుతురుమల్లి గోపాల కృష్ణా రావు ప్రమాణ స్వీకారం చేశారు. హై కోర్టు ప్రాంగణంలోని ఫస్ట్ కోర్టు హాల్ లో బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఇరువురితో దైవసాక్షిగా ప్రమాణం చేయించారు. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టు లో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న ఇరువురిని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను భారత రాష్ట్రపతి ఆమోదించిన పిదప వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, న్యాయమూర్తులు, న్యాయాధికారులు, న్యాయవాదులు, హై కోర్ట్ సిబ్బంది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *