విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
రాజకీయాలలో గెలుపోవటములు సహజమని తమ తప్పులు సరిదిద్దుకుంటూ వైసీపీ బలోపేతానికి మరింత కష్టపడి పని చేస్తామని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి దేవినేని అవినాష్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు చిరస్థాయిగా ఉండిపోతాయని అన్నారు.. ఏ కష్టం వచ్చినా వైసిపి కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 12వ డివిజన్ అయ్యప్ప నగర్ లో వైసిపి కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది.. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి దేవినేని అవినాష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు కార్యకర్తలకు ఏ చిన్న ఇబ్బంది కలిగిన తాను అండగా ఉంటనని హామీ ఇచ్చారు.. పార్టీ సిద్ధాంతాలను నమ్మకాలను మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు.. గత వైసిపి ప్రభుత్వంలో ఈ డివిజన్లో 15 కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అవినాష్ తెలిపారు.. డివిజన్లో మెయిన్ రోడ్లు ఇంటర్నల్ రోడ్లు నిర్మించినట్లు చెప్పారు.. కొన్ని కారణాల వలన తాము ఓడిపోయినప్పటికీ డివిజన్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చిరస్థాయిగా మిగిలిపోతాయని అన్నారు.. తమ ఓటమికి గల కారణాలు విశ్లేషించుకుంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని దానిలో భాగంగానే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.. 2014లో వచ్చిన స్థానాలు కంటే 2019లో మరిన్ని సీట్లు సంపాదించుకొని అధికారంలోకి వచ్చినట్లు గుర్తు చేశారు.. వైసీపీ అధినేత జగన్ కు కష్టాలు ఏమి కొత్త కాదని పార్టీ పెట్టినప్పుడు ఇద్దరు వ్యక్తులుగా ఉన్న వైసిపి నేడు కోట్లాదిమంది అభిమానులు సంపాదించుకుందని గుర్తు చేశారు.. అన్ని ప్రధాన పార్టీలు కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేసిన తమ పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయనీ చెప్పారు.. రాజకీయాలలో గెలుపోవటములు సహజమని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జగన్ కోసం కష్టపడి పని చేస్తామని పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరం సిద్ధంగా ఉన్నామని అన్నారు.. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, 12వ డివిజన్ ఇంచార్జ్ మాగంటి నవీన్, వైసీపీ కార్పొరేటర్లు,, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …