Breaking News

ప్రమాద రహిత సమాజం కోసం యువత కృషి చేయాలి: ఎం.పి.కేశినేని శివ నాథ్

-వికలాంగులకు హైడ్రాలిక్ ప్రోస్థేటిక్ లెగ్స్ పంపిణీ
-సుదీక్షన్ ఫౌండేషన్, రోడ్ సేఫ్టీ ఎన్.జీ.వో సంస్థ సంయుక్త నిర్వహణ

విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
యువత, విద్యార్థులు అతి వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడి వికలాంగులుగా మారి, తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చుతున్నారని ఎం.పి కేశినేని శివనాథ్ అన్నారు. సుదీక్షన్ ఫౌండేషన్, రోడ్ సేఫ్టీ ఎన్.జీ.వో సంయుక్తంగా విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్.టి.ఆర్ భవన్ లో గురువారం నిర్వహించిన హైడ్రాలిక్ ప్రోస్థేటిక్ లెగ్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుదీక్షణ్ ఫౌండేషన్ వారు రోడ్ ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన ముగ్గురు విద్యార్థులకు లక్షన్నర రూపాయలు విలువచేసే హైడ్రాలిక్ ప్రోస్థేటిక్ లెగ్స్ ను ముగ్గురికి ఉచితంగా పంపిణీ చేశారు. నెల్లూరు కి చెందిన ఎం. ప్రణవిక , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన జి.సాయికిరణ్, హన్మ కొండకు చెందిన ఆర్.సాయికిరణ్ లకు ఎం.పి.కేశినేని శివ నాథ్ హైడ్రాలిక్ ప్రోస్థేటిక్ లెగ్స్ ను అందజేశారు.

ఈ ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివ నాథ్ మాట్లాడుతూ ప్రమాదాలలో కాళ్లు కోల్పోయిన విద్యార్థులకు తిరిగి నూతన జీవితాన్ని అందించాలని ప్రయత్నిస్తున్న సుదీక్షన ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చిగురుపాటి విమలను అభినందించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతకు అత్యంత ఖరీదైన హైడ్రాలిక్ ప్రోస్థేటిక్ లెగ్స్ అందించి వారిలో నూతన ఉత్సాహం ఆత్మవిశ్వాసం నింపటానికి సుదీక్షణ ఫౌండేషన్ కి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రమాదరహిత సమాజం కోసం యువత ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పిలుపు నిచ్చారు. అనంతరం సుదీక్షన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చిగురుపాటి విమల మాట్లాడుతూ తన కొడుకు కూడా ప్రమాద కారణంగా చనిపోయాడని… ఇలా ప్రమాదాలలో వికలాంగులుగా మారిన వారు జీవితాన్ని కోల్పోకూడదు అనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ స్థాపించినట్లు చెప్పారు. వీడు(veedu)రోడ్ సేఫ్టీ ఎన్.జీ.వో డైరెక్టర్ ఎమ్.వాసు మాట్లాడుతూ నిత్యం ప్రమాదాల్లో ఎంతోమంది విద్యార్థులు వికలాంగులుగా మారుతున్నారని, వాళ్ల జీవితం చీకటి మయం కాకూడదనే ఉద్దేశంతో చిగురుపాటి విమలతో కలిసి కృషి చేస్తున్నట్లు తెలిపారు..

ఈ కార్యక్రమంలో టి.డి.పి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం. కె బేగ్, రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాధం,కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, సుదీక్షణ ఫౌండేషన్ మెడికల్ క్యాంపు ఇంఛార్జి కి.రాము పాల్గొన్నారు..

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *