విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారుల వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నాయకులు ఎం.పి కేశినేని శివ నాథ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. గురునానక్ కాలనీ లోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో గురువారం కలవటం జరిగింది .అధిక మొత్తం లో విధిస్తున్న చలానాల నుంచి, సీజ్ చేసిన ఆటో లను విడిపించాల్సిందిగా కోరారు..ఆటో నాయకులు చెప్పిన సమస్యలపై సానుకూలంగా స్పందించారు.సంబంధిత అధికారులతో మాట్లాడి ఇబ్బందులు లేకుండా చూస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐ. ఎఫ్.టి.యు నగర అధ్యక్షులు డి.శ్రీనివాసరావు, ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అద్యక్షుడు కె.పొలరి, ఐ. ఎఫ్.టి.యు ఎన్.టి.ఆర్ జిల్లా అద్యకులు ఎ.రవిచంద్ర, నగర ప్రధాన కార్యదర్శి సి.హెచ్ పెద్ది రాజు, అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …