-జాతీయ క్రీడ దినోత్సవం సందర్భంగా పేద క్రీడాకారులకు సహాయార్థం విరాళం ప్రకటించిన మంత్రి
-ఇదివరకే రాజధాని నిర్మాణానికి మొదటి నెల జీతం అందజేశారు
విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ క్రీడ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన నెల జీతం జీతాన్ని ₹3,16,000/- రూపాయలను పేద క్రీడాకారుల అవసరాలకు నిమిత్తం అందజేస్తున్నట్లుగా తెలిపారు. ఇదివరకే తన మొదటి నెల జీతాన్ని రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి మంత్రివర్యులు ప్రకటించిన విషయం తెలిసిందే.