విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉచిత ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా అధికారులను ఆదేశించారు. కంచికచర్ల మండలం కీసర ఇసుక స్టాక్ పాయింట్ వద్ద శుక్రవారం జాయింట్ కలెక్టర్ నిధి మీనా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంపిణీ విధానాన్ని,స్టాక్ పాయింట్ వద్ద రిజిస్టర్ పరిశీలించారు. స్టాక్ పాయింట్ వద్ద బుకింగ్ అవకాశం ఉండకూడదన్నారు. నూతన పాలసీ అమలులోకి వచ్చే వరకు యెటువంటి విమర్శలకు, లోటుపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ నిధి మీనా అధికారుల ను ఆదేశించారు.
Tags vijayawda
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …