2 అక్టోబర్ 2024 నాటికి ఐదేళ్ల సర్వీస్ పూర్తి అవుతున్నందున అందరికీ సాధారణ బదిలీలకు అవకాశం కల్పించి అత్యంత పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీల విధానం ప్రకారం బదిలీలు కల్పించాలి

-గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అంతర్ జిల్లా బదిలీలు కల్పించి, వ్యవసాయ అనుబంధ విభాగాల ఉద్యోగులకు మరియు ఎ.యన్.యం లకు సైతం బదిలీలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి : ఎం.డి.జాని పాషా రాష్ట్ర అధ్యక్షుడు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అంతర్ జిల్లా బదిలీలు కల్పించాలని,బదిలీల నుండి మినహాయించిన వ్యవసాయ అనుబంధ విభాగాల సచివాలయ ఉద్యోగులైన అగ్రికల్చర్ అసిస్టెంట్లు,హార్టీ కల్చర్ అసిస్టెంట్లు సెరీ కల్చర్ అసిస్టెంట్లు,యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లు,ఫిషరీస్ అసిస్టెంట్లు మరియు విలేజ్ ఎ.యన్.యంలు మరియు వార్డు హెల్త్ కార్యదర్శులకు సైతం బదిలీలు కల్పించాలని ఎం.డి.జాని పాషా సచివాలయాల శాఖకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 15వ తేదీ వరకు బదిలీలకు అవకాశం కల్పించడంతో,గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆన్లైన్లో బదిలీల కొరకు అప్లికేషన్ నమోదు చేసుకునేందుకు గడువు పొడగించి అవకాశం కల్పించాలని కోరారు. ఆన్లైన్లో నమోదు చేసుకోని వారికి సైతం ఆఫ్ లైన్ ద్వారా నేరుగా కౌన్సిలింగ్ కేంద్రాలలో బదిలీ అభ్యర్థన స్వీకరించి బదిలీ కోరుకుంటున్న ఉద్యోగులకు అవకాశం కల్పించాలని కోరారు. అలాగే,ఇప్పటికీ మెడికల్ బోర్డు సర్టిఫికెట్లు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు మెడికల్ సర్టిఫికెట్లు జిల్లా మెడికల్ బోర్డులకు సచివాలయాల శాఖ నుండి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. కాగా,ఆకారణంగా ఉద్యోగులకు వివిధ మండలాలు మరియు మున్సిపాలిటీలలో యన్.ఒ.సిలు మరియు నోడ్యూ సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతుందని తెలుపుతూ అధికారుల ద్రుష్టికి సైతం పై అంశాల గురించి వినతి అందించడం జరిగిందని అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకొని ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చాలని బలవంతంగా ఉద్యోగులకు ఇష్టంలేకుండా పరిపాలనా సౌలభ్యం పేరిట బదిలీలు చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్న అంశాన్ని పరిగణించి ఉద్యోగులకు సచివాలయాల శాఖ అధికారులు మేలు చేయాలని ఎం.డి.జాని పాషా ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *