రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం ఉదయం నారాయణపురం లో ఉన్న శ్రీ గౌతమీ జీవ కారుణ్య వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ వృద్ధులకు సామాజిక భద్రత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు కలెక్టర్ పి ప్రశాంతి అందచేశారు. ఆగస్ట్ నెలకు చెందిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సెప్టెంబర్ 1 వ తేదీ ఆదివారం సెలవు దినం కావడం తో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒక రోజు ముందుగానే పంపిణి చేస్తున్నట్లు వృద్ధులకు తెలియ చేశారు. స్వయంగా జిల్లా కలెక్టర్ వొచ్చి పెన్షన్ అందచెయ్యడం పట్ల వృద్దులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవ కారుణ్య వృద్ధ ఆశ్రమం లో 60 మంది పెన్షన్ లబ్దిదారులకు ఫించన్ అందచేస్తూన్నట్లు అధికారులు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 2,39,924 మందికి ఉదయం నుంచే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఒక క్రమ శిక్షణతో కూడి అంద చెయ్యడం లో అధికారులు, సిబ్బంది పని తీరును కలెక్టర్ అభినందించారు. రాష్ర్ట ప్రభుత్వం ఆదేశాలు మేరకు ఉదయం పది గంటలకే 83 శాతం మందికి ఇంటి వద్దనే పంపిణి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదరపు కమిషనర్ పి ఎమ్ సత్యవేణి తదితరులు పాల్గొన్నారు.