-అధిక వర్షాలు నేపద్యంలో కంట్రోల్ రూం పరిశీలించిన కలెక్టర్
-ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ పై ఎంపిడిఓ లతో సమీక్షా
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం ఉదయం రాజానగరం తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్యాలయ రికార్డులను, ఆన్లైన్ లో నమోదు చేసిన వాటి వివరాలను అడగడం జరిగింది. మండల పరిధిలో మ్యుటేషన్ కు చెందినా ఫైల్స్, వాటి నిర్వహణా తీరును కలెక్టర్ పరిశీలించారు. సంబంధిత మ్యుటేషన్ కు చెందిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ నమోదు చేయాలని ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కంట్రోల్ రూం లను 24 x 7 అందుబాటులో ఉండే విధంగా విధులను కేటాయించాలని , ఆమేరకు కేటాయించిన సంబంధిత రికార్డులను పరిశీలించారు. పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అనంతరం ఎంపిడిఓ లతో పెన్షన్ల పంపిణీ ప్రగతి పై సమీక్షా నిర్వహించారు.