-ఒక్కరోజు ముందుగానే కూటమి పార్టీ మండల నాయకులు, అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ…
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సెప్టెంబర్ 1వ తేదీన ఇవ్వవలసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ ను ఒకరోజు ముందుగానే అవ్వ, తాతలకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా పాకాల మండలం పదిపట్ల బైలు పంచాయితీలో కూటమి పార్టీ మండల నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రభుత్వం ముందు రోజు ఆగస్టు 31న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ 100% పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. పెంచిన పెన్షన్ ను లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని తెలిపారు. పెన్షన్ దారులు ఇంటి వద్దనే ఉండి పెన్షన్ తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజల కష్టాలను, సమస్యలు తెలిసినవారు కాబట్టే మా పెద్దాయన చంద్రబాబు ఒక్క రోజు ముందు పెన్షన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కక్షపూరితమైన రాజకీయాలకు తావు లేకుండా చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. తమ గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు పలు గ్రామ సమస్యలను వివరించిన గ్రామస్తులు. ఎమ్మెల్యే పలు సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలకు నిధులు రావడం జరిగిందని వెంటనే పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. పార్టీలకతీతంగా కలిసిమెలిసి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.