Breaking News

ఘరానా మోసం చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలి…

-గ్రూప్స్ అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో పరిగణన, స్థలాల పేరిట కోట్ల రూపాయల ఘరానా మోసం చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని, హోమ్ మంత్రిని కోరిన పురందరేశ్వరి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బిజెపి వారధి కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి ప్రజలనుండి పలు వినతులను స్వీకరించి, పరిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థలాల పేరిట ప్రజలనుండి కోట్ల రూపాయలను వసూలు చేసి మోసం చేసిందని పలువురు బాధితుల వినతుల మేరకు దుర్గాదేవి అనే మహిళపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత తో ఫోన్లో మాట్లాడిన పురందరేశ్వరి. విజయవాడ వెస్ట్ బైపాస్ విస్తరణలో తమకు రావల్సిన పరిహారం త్వరితగతిన ఇప్పించాల్సిందిగా కోరిన రైతులు. మార్చ్ 2024 లో జరిగిన APPSC గ్రూప్స్ పరీక్షలో ఉత్తర్ణులైన వారిని ప్రస్తుతమున్న 1:50 కాకుండా 1:100 శాతంగా సెలక్షన్ ఉండాలని, తద్వారా ఎంతోమందికి లబ్ధి చేకూరుతుంది అని బిజెపి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్ట వంశీ కృష్ణ చేసిన విజ్ఞాపనపై సానుకూలంగా స్పందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి లేఖ ద్వారా కోరిన పురందరేశ్వరి. అవనిగడ్డలోని పులిగడ్డ రైతుల పట్టా భూముల సమస్యపై వెంటనే తగిన చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ ని కోరిన పురందరేశ్వరి.
తిరుపతిలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మి లక్షలును కోల్పోయిన వ్యక్తులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ని పురంధరేశ్వరి కోరారని ఒక ప్రకటనలో తెలిపిన రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ. ఈ కార్యక్రమంలో మైనారిటీ మోర్చా, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ, కుమార స్వామి, మైలవరం అసెంబ్లీ కన్వీనర్ నూతలపాటి బాలకోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *