అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణానికి సమీపంలో మొగలు చెర్వు, పోతిరెడ్డి పల్లి ఊర చెర్వు,అన్నవరం పెద్ద చెర్వు గట్లు భారీ వర్షాలుకు తెగి పడి పోవడంతో నూజివీడు పట్టణ సమీపంలోని వెలంపేట తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ ప్రాంతాలను రాష్ట్ర గృహా నిర్మాణం,సమాచార పౌర సంభందాల శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి పరిశీలించి ప్రజలను, అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ముంపుకు గురైన ప్రాంతాల ప్రజలను నూజివీడు జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ కుతరలిస్తున్నారు. భాదితులకు అవసరమైన మంచి నీరు, ఆహారం, ఇతర అవసరమైన ఏర్పాట్లును చేయాల్సిందిగా అధికారులను ఆదేశించేరు. అదేవిధంగా వర్షాలు వలన అంటు రోగాలు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, ఏవిధమైన పరిస్థితిని ఎదురైన ఎదుర్కొడానికి సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.
Tags amaravathi
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …