-పునరావస కేంద్రాల్లో, ఇళ్ల వద్ద చిక్కుకున్న వారికి ఆహారం అందేటట్టు చర్యలు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద వల్ల దెబ్బతిన్న ప్రాంతాల ప్రజలకు పునరావస కేంద్రాలు పెంచి దాదాపు ఒక లక్ష మందికి ఆహారం కల్పించినట్టు తెలిపారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ప్రస్తుతం పునరావస కేంద్రాలలో 1000 మంది కీ పైగా భోజన సదుపాయాలు, త్రాగునీరు,పాలు, విద్యుత్, మరుగుదొడ్లు మరియు ఇతర అవసరమైన పదార్థాలు అందుబాటులో ఉన్నాయని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సరైన సురక్షితం భోజనాన్ని అందిస్తున్నామని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. కేవలం పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు మాత్రమే కాకుండా ఇళ్ల దగ్గర చిక్కుకున్న వారికి కూడా భోజనాల్ని వారి ఇంటి వద్దకే పంపిస్తూ అందరికీ భోజన ఏర్పాట్లు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు కమిషనర్ ధ్యానచంద్ర. ముంపు ప్రాంతంలో చిక్కుకున్నవారు భయభ్రాంతులకు గురికాకుండా విజయవాడ నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్0866-2424172, 0866-2427485 కు ఫోన్ ద్వారా కానీ 8181960909 కు మెసేజ్ రూపంలో కానీ వాళ్ళ సమస్యను తెలిపినచో వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు.