-జిల్లా , డివిజన్ , మున్సిపల్, మండల స్థాయిలో కూడా ప్రజల నుంచి అర్జిల స్వీకరణ
-కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సెప్టెంబరు 2 వ తేదీ సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక – “మీకోసం” ద్వారా కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, ఇతర జిల్లాల అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించ నున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్ నందు, అదేవిధంగా డివిజన్, మునిసిపల్, మండల స్థాయి లో ఆయా ప్రధాన కార్యాలయాల్లో సంబంధిత శాఖల అధికారులు ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలు నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు తెలియ చేశారు. ప్రజలకి స్థానికంగా అందుబాటులో ఉండి అధికారులు డివిజన్, మండల కేంద్రాలలో అర్జీలు స్వీకరించడం పరిష్కారం చేయనున్నట్లు, కావునా ప్రజలు ఈ మేరకు స్థానికంగా ఉండే అధికారులకి అర్జీలు అందచేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.