-జిల్లా వ్యాప్తంగా 22 కంట్రోల్ రూం ల ఏర్పాటు 24 x 7 పర్యవేక్షణ
-కలక్టరేట్ లో 15 శాఖలతో కమాండ్ కంట్రోల్ రూం
-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని, క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం క్షేత్ర స్థాయిలో పర్యటించి, అనంతరం టెలి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను సిబ్బందిని అప్రమత్తం చెయ్యడం జరిగిందన్నారు. ఇప్పటికే బలహీనంగా ఉన్న ఏటిగట్లు, కాలువ గట్ల నీ పటిష్ఠం చేసేందుకు సమన్వయ శాఖల అధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి , ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో ఆమేరకు పనులను చేపట్టడం, ఇసుక బస్తాలు వేసి గట్ల ను పటిష్ఠం చెయ్యడం జరిగిందన్నారు. రానున్న రెండు మూడు రోజులు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరడం జరిగిందని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. కలక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు, మూడు షిఫ్టుల్లో 15 శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది 24 x 7 అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు మరమ్మతులు, పునరుద్ధరణ పనులు కోసం విద్యుత్తు సంస్థ సిబ్బంది సన్నద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో ఏటిగట్ల, ఇరిగేషన్ కాలువల పటిష్టతకు క్షేత్ర స్థాయిలో వ్యక్తిగతం పరిశీలన చెయ్యడం జరిగిందన్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మెడికల్ క్యాంపులను నిర్వహించి ప్రజలకు తగిన వైద్య సేవలను అందించడం జరుగుతోందన్నారు. టామ్ టామ్ ల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయి అధికారులు ప్రత్యేక అధికారులు ఆయా మండల ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంచి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు..
కంట్రోల్ రూం నెంబర్లు
జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం, రాజమహేంద్రవరం
89779 35609
రెవిన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయము, రాజమహేంద్రవరం – 08832-442344
సబ్ కలెక్టర్ వారి కార్యాలయము, కొవ్వూరు
08813-231488
తహశీల్దారు వారి కార్యాలయము, రాజమహేంద్రవరం రూరల్ 0883-2416005
తహశీల్దారు వారి కార్యాలయము, రాజమహేంద్రవరం అర్బన్ 94946 62219