రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల హాస్టల్ రాజమండ్రి రూరల్, ప్రభుత్వ బిసి కళాశాల బాలికల హాస్టల్ రాజమండ్రి అర్బన్, ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం రాజమండ్రి లని జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఆదివారం సందర్శించినట్లు జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి. శశాంక తెలిపారు. ఆయా వసతి గృహాలలో పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రతపై సూచనలను ఇవ్వడం జరిగిందన్నారు. సీజనల్ మార్పులు నేపథ్యం లో వేడి నీటి ఆవశ్యకతను , ఆహార సరఫరా తదితర అంశాలపై సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆహార పరిశుభ్రత మరియు తయారీపై ఖచ్చితమైన దిశా నిర్దేశం చేసినట్లు తెలిపారు. విద్యార్థుల తో సంభాషించి అందుతున్న సదుపాయాలు పై వివరాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. సీజనల్ మార్పులు నేపథ్యం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసినట్లు తెలిపారు.
Tags rajamandri
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …