మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మోపిదేవి మండలంలోని లోతట్టు ప్రాంతాలైన బొబ్బర్లంక, కొత్తపాలెం గ్రామాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడి పునరావాస కేంద్రంలో వారికి భోజనము మంచినీరు వంటి సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తహసిల్దార్ శ్రీవిద్యను ఆదేశించారు ఆదివారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పలువురు అధికారులతో సెల్ఫోన్లో మాట్లాడుతూ వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేశారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం రాను రాను పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఏ ఒక్కరి ప్రాణనష్టం జరగకూడదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
Tags machilipatnam
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …