-కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08672-252572
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లాలో అధిక వర్షాలు, కృష్ణానది వరద ఉధృతి ఎదుర్కోవడానికి జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లాలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08672-252572.
వివిధ శాఖల అధికారులు, సిబ్బంది కంట్రోల్ రూమ్ లో రెండు, మూడు షిఫ్ట్ లలో 24 గంటలు అందుబాటులో ఉంటూ వారి వారి శాఖల ద్వారా చేపట్టిన చర్యలు, సహాయ పునరావస కేంద్రాల ఏర్పాటు, వరద బాధితులకు అందిస్తున్న సహాయం తదితర అంశాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ కు వచ్చిన సమస్యలు, ఫిర్యాదులు ఆయా శాఖల అధికారులకు చేరవేసి, తగిన పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచనలు జారీ చేస్తూ పర్యవేక్షిస్తున్నారు.