గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్చతా హి సేవా కార్యక్రమాన్ని గుంటూరు నగరంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో విజయవంతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ విభాగాదిపతులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో గుంటూరు నగరంలో స్వచ్చతా హి సేవా కార్యక్రమ అమలు పై విభాగాధిపతులు, ఇతర అధికారులతో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్వచ్చ భారత్ సంకల్పంతో ప్రవేశ పెట్టిన స్వచ్చతా హి సేవా కార్యక్రమం అనే పరిశుభ్రతకు సంబందించిన ప్రచార కార్యక్రమం ఈనెల 17న ప్రారంభమై 15 రోజుల పాటు అనగా గాందీ జయంతి అక్టోబరు 2వరకూ నిర్వహించాలన్నారు. ఇందులో భాగంగా ప్రజల్లో స్వచ్చతపై అవగాన కల్గించడం, ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. వార్డ్ సచివాలయాల వారీగా సామూహిక పరిశుభ్రత డ్రైవ్‌లను నిర్వహించాలన్నారు. కార్యక్రమాల అమలులో నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. కార్యక్రమాల వారీగా జిఎంసి అధికారులను నోడల్ అధికారులుగా విధులు కేటాయించాలన్నారు. అలాగే నగరంలో పారిశుధ్యం, త్రాగునీరు, వీధి దీపాల సమస్యల పరిష్కారం, పారిశుధ్య కార్మికులకు వైద్య శిబిరాల నిర్వహణ చేపట్టడం జరుగుతుందని, విధులు కేటాయించబడిన ప్రతి ఒక్కరూ అంకిత భావంతో గుంటూరు నగరంలో స్వచ్చతా హి సేవా కార్యక్రమం విజయవంతంకు కృషి చేయాలన్నారు.
సమావేశంలో ఎస్.ఈ. ఎం.శ్యాం సుందర్, సిటి ప్లానర్ డి.రాంబాబు, ఎంహెచ్ఓ మధుసూదన్, తూర్పు ఎంహెచ్ఓ(ఇంచార్జి) రామారావు, మేనేజర్ ప్రసాద్, ఏడిహెచ్ రామారావు, డిసిపి, ఈఈలు, ఆర్ఓలు, ఎస్ఎస్ లు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …