-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ప్రభావిత ప్రాంతాలలో త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం రాత్రి వైయస్సార్ జక్కంపూడి కాలనీలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ఒకటైన వైఎస్ఆర్ జక్కంపుడి కాలనీలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వైయస్సార్ జక్కంపూడి కాలనీలో నీటి సరఫరా జరుగుతున్న మోటార్ వరద వల్ల పూర్తిగా పాడైపోవడం గమనించి వెంటనే అక్కడ కొత్త మోటర్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితమైన త్రాగునీరు సరఫరా చేసేందుకు వెంటనే చర్యలు తీసుకొని ప్రజలకు త్రాగునీటిని సరఫరా చేసేటట్టు చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. ఈ పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్రతో పాటు అడిషనల్ కమిషనర్ (జనరల్) డాక్టర్ ఏ మహేష్,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ ఎస్ ఎన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.