-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో వరద ప్రభావిత ప్రాంతాలలో విజయవాడ నగరపాలక సంస్థ వారు సరఫార చేస్తున్న నీరును త్రాగుటకు వినియోగించవలనని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కుళాయి ద్వారా అందరికీ అందిస్తున్న నీటి సరఫరాను త్రాగుటకు వినియోగించవచ్చునని అన్నప్పటికీ ప్రజలందరూ ఆరోగ్యం దృశ్య త్రాగు నీటిని కాచి తాగ వలెనని విన్నవించారు.
62,63, 64 డివిజన్ ల లో పల్లపు ప్రాంతం ప్రజలు మరోక రెండు రోజులు త్రాగు నీటి విషయం లో అప్రమత్తం గా ఉండి ట్యాంకర్ ద్వారా సరఫరా చేసిన నీటిని త్రాగు నీటి అవసరాలకు వాడు కోవాలని కమిషనర్ తెలియ జేశారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాలకు ఇప్పటివరకు విజయవాడ నగరపాలక సంస్థ వారు నీటి సరఫరా చేస్తున్నప్పటికీ అది కేవలం వాడుటకు మాత్రమే వినియోగించవలెనని హెచ్చరికలు జారీ చేశారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సూచనల మేరకు బుడమేరు వరదలు నుండి సత్వరమే విజయవాడ కోలుకొని , త్రాగునీటి సరఫరా కూడా సత్వరంగా పూర్తి స్థాయి లో పునరుద్ధరించ బడి, సరఫరా చేస్తున్నామని తెలిపారు.