Breaking News

నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా లక్షల మంది ఖాదీ కళాకారులకు, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ బహుమతులు

-అక్టోబర్ 2, 2024 నుంచి అమలయ్యేలా , స్పిన్నర్లకు 25 శాతం , నేత కార్మికుల వేతనాలు 7 శాతం పెరుగుతాయని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్ మనోజ్ కుమార్ ప్రకటన.
-ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ KVIC – ప్రారంభించిన ‘సైలై సమృద్ధి యోజన’, ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ.
-ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ లో ఏర్పాటు చేసిన స్మారక చరఖా తరహాలో, పోర్‌బందర్‌లోని అస్మావతి నదీతీరంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ సంకేతమైన చరఖా ఆవిష్కరణ .
-దేశవ్యాప్తంగా 3,911 మంది లబ్ధిదారుల ఖాతాలకు రూ. 101 కోట్ల మార్జిన్ మనీ సబ్సిడీ పంపిణీ; కొత్తగా 43,021 మందికి లభించిన ఉపాధి.
-KVIC ఛైర్మన్ చే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా PMEGP – 1100 కొత్త యూనిట్ల ప్రారంభం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని, మూడవ సారి మోడీ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖాదీ , గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్మన్ మనోజ్ కుమార్, భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్యర్యంలో పూజ్యబాపూజీ జన్మస్థలమైన పోర్‌బందర్‌లోని అస్మావతి నదీతీరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్షలాది మంది ఖాదీ కళాకారులకు బహుమతిని అందించింది. స్పిన్నర్ల వేతనాన్ని 25 శాతం మేర, చేనేత కార్మికుల వేతనాల్లో 7 శాతం పెంచుతున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. పెంచిన వేతనాలు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి నాడు అక్టోబర్ 2, 2024 నుంచి అమలులోకి వస్తాయి. ఈ సందర్భంగా అస్మావతి రివర్ ఫ్రంట్‌లో ఏర్పాటు చేసిన 26 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పు గల స్టెయిన్‌లెస్ స్టీల్ ‘స్మారకచరఖా’ను కూడా ఆవిష్కరించారు. కార్యక్రమంలో KVIC చైర్మన్ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) కింద 3911 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి, రూ. 101 కోట్ల మార్జిన్ మనీ సబ్సిడీని పంపిణీ చేశారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 1100 కొత్త PMEGP యూనిట్లను KVIC చైర్మన్ ప్రారంభించారు .
కార్యక్రమంలో ప్రసంగించిన మనోజ్ కుమార్ తన హయాంలో స్పిన్నర్లు, చేనేత కార్మికులకు రెండోసారి వేతనాలు పెంచామని తెలిపారు. అక్టోబర్ 2, 2024 నుంచి స్పిన్నర్లకు రూ. 10 బదులుగా రూ. 12.50 వేతనం అందుతుంది. అంతకుముందు, ఏప్రిల్ 1 , 2023న, ఒక్కొక్కరికి రూ.7.50 నుంచి రూ.10కి పెంచారు. ‘ ఖాదీ క్రాంతి ‘ ఆలంబనగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఖాదీ స్పిన్నర్లు, చేనేత కార్మికుల జీవితాల్లో పెద్ద మార్పు సాధ్యమైంది. ఖాదీ సాలుసరి ఉత్పత్తి గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.55 లక్షకోట్లు దాటింది. ఖాదీ కుటుంబ కళాకారులకు ప్రయోజనాలను వర్తింపజేయాలనే ప్రధానమంత్రి దార్శనికతకి అనుగుణంగా వారి వేతనాలను పెంచాలని కమిషన్ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా సుమారు 3,000 నమోదిత ఖాదీ సంస్థలు ఉన్నాయని , వాటి ద్వారా 4.98 లక్షల ఖాదీ కళాకారులు పనిచేస్తున్నారు, వీరిలో 80 శాతం మంది మహిళలు. పెరిగిన వేతనాలు వారికి కొత్త ఆర్థిక బలాన్ని చేకూరుస్తాయి. మోదీ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు దాదాపు 213 శాతం వేతనాలు పెంచారని, ఖాదీ ద్వారా గ్రామీణ భారతదేశం ఆర్థికంగా సాధికారత సాధిస్తుందనడానికి ఇదే ప్రతీక అని ఆయన అన్నారు .
ఈ సందర్భంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన స్మారక చరఖా తరహాలో అస్మావతి రివర్‌ఫ్రంట్‌లో స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన స్మారక చరఖాను కెవిఐసి చైర్మన్ కెవిఐసి ఆవిష్కరించారు. అంతకుముందు సెప్టెంబర్ 12న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఇలాంటి చరఖాను ఆవిష్కరించారు తన అధ్యక్ష ప్రసంగంలో, కొత్త తరాన్ని జాతిపిత మహాత్మాగాంధీ ఆలోచనలతో అనుసంధానం చేయడంతోపాటు భారత జాతీయ వారసత్వ సంపద అయిన ఖాదీ గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే స్మారక చరఖాను ఏర్పాటు చేయడం వెనుక కెవిఐసి లక్ష్యం అని చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ చెప్పారు. ఈ సందర్భంగా ‘న్యూ ఖాదీ ఆఫ్ న్యూ ఇండియా’ ‘ ఆత్మనిర్భర్ భారత్ , వికాసిత్ భారత్ క్యాంపెయిన్’ ప్రచార కార్యక్రమాలకు కొత్త దిశానిర్దేశం జరిగిందని ఆయన అన్నారు . ఈ చరఖా, పూజ్య జన్మస్థలంలో ఏర్పాటవ్వడం బాపు, జాతిపిత వారసత్వాన్ని కొత్త తరానికి గుర్తుచేయడమే.
ఈ కార్యక్రమంలో , PMEGP కింద దేశవ్యాప్తంగా 3911 మంది లబ్ధిదారుల ఖాతాలకు రూ. 101 కోట్ల విలువైన మార్జిన్ మనీ (సబ్సిడీ) పంపిణీ అయ్యింది. దీని ద్వారా 43,021 కొత్త ఉద్యోగాల కల్పన సైతం సాకారం అయ్యింది. దీనితో పాటు, దేశవ్యాప్తంగా 1100 కొత్త PMEGP యూనిట్లను కూడా ఖాదీ , విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్ ప్రారంభించారు. లబ్ధిదారులను ఉద్దేశించి చైర్మన్ కెవిఐసి మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ , MSME మంత్రిత్వ శాఖ – మార్గదర్శకత్వం , PMEGP దేశంలోని కుటీర పరిశ్రమకు కొత్త శక్తిగా ఉద్భవించింది. దీని ద్వారా గత 10 ఏళ్లలో 9.58 లక్షల కొత్త ప్రాజెక్టుల ద్వారా 83.48 లక్షల మందికి ఉపాధి లభించింది అన్నారు. ఈ కాల పరిధిలో, KVIC సుమారు రూ. 24 వేల కోట్లు విలువైన ఆదానపు సొమ్మును పంపిణీ చేసిందని ఆయన తెలిపారు ఖాదీ , గ్రామ పరిశ్రమల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో 10.17 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది.
గుజరాత్‌లోని KVIC రాష్ట్ర కార్యాలయంతో అనుబంధ ఖాదీ సంస్థల ప్రతినిధులు , ఖాదీ కార్మికులు, కళాకారులు , KVIC అధికారులు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *