-కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు
-అందమైన విజయవాడ కోసం వాల్ పెయింటింగ్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ అందాలను మరింత పెంచేందుకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా నగరంలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలలో వాల్ పెయింటింగ్స్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు. విజయవాడ నగర పాలక కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం కామినేని నగర్, డొంక రోడ్ నందు గల గోడలపైన అందమైన పెయింటింగ్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు పాల్గొని గోడల పైన అందమైన పెయింటింగ్లను వేసి స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ విజయవాడ అందాలను మరింత పెంచటానికి స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ ఎంతో కృషి చేస్తుందని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో విజయవాడ ను అభివృద్ధి చేయటానికి ప్రతి ఒక్క కార్యక్రమంలో తాము ముందడుగు వేస్తున్నామని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల వ్యవధిలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాదరణ పొందారని తెలిపారు. స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజయవాడ నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షన్ లో ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా స్లం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నామని తెలిపారు. నగర పరిధిలో ఉన్న మురికివాడల్లో అందమైన వాల్ పెయింటింగ్స్ ద్వారా ఒక అందమైన మార్పుని తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.