జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులతో అవగాహన సదస్సులు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులతో అవగాహన సదస్సులు నిర్వహించి గృహ నిర్మాణం పనులు ముమ్మరం చేయాలని డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ వారి ఛాంబర్ నుండి గృహ నిర్మాణం పై క్షేత్రాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 28వ తేదీ శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని లేఔట్లలోను, కమ్యూనిటీ హాళ్లలోనూ గృహ నిర్మాణాల లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి పి ఎం ఏవై పట్టణ గ్రామీణ గృహ నిర్మాణం పై అవగాహన కల్పించాలన్నారు. స్థానిక శాసనసభ్యులు ప్రజాప్రతినిధుల సహకారంతో గృహ నిర్మాణం పురోగతి సాధించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

అన్ని గృహాలు వచ్చే సంవత్సరం మార్చి నెలాఖరికి ఎలాంటి పరిస్థితిలోనైనా పూర్తి కావాలన్నారు. ప్రస్తుతం ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు మరల కొత్తగా వచ్చే ఇల్లు మంజూరు చేసే అవకాశం లేదని స్పష్టంగా తెలియజేయాలన్నారు. అలాగే ఇప్పటికే గృహాలు మంజూరైన వారికి యూనిట్ విలువ పెంచుతారనే అపోహ పడవద్దని లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు. ఏమైనా ఆర్థిక సహాయం అవసరం అయితే పొదుపు సంఘాల నుండి రుణాలు అందించేందుకు కృషి చేస్తామని తెలియజేయాలన్నారు. గృహ నిర్మాణానికి కావలసిన స్టీలు సిమెంటు ఇసుక తదితర సామాగ్రిని, కూలీలు మేస్త్రీలు సమకూరుస్తామని చెప్పాలన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుండి హౌసింగ్ ఈ ఈ వెంకట్రావు, డి ఈ రమేష్ బాబు, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, సచివాలయం ఇంజనీరింగ్ సహాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *