-ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రౌండ్ టేబుల్ ఇండియా వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. ఊర్మిళ నగర్ లోని హెచ్ ఓ ఫంక్షన్ హాల్ లో రౌండ్ టేబుల్ ఇండియా, ఎస్బిఐ కార్డ్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ శాసనసభ్యులు సుజనా హాజరై బాధితులకు నిత్యవసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ. తోటి వారికి సాయపడాలనె మంచి మనసుతో వరద బాధితుల సహాయార్థం 60 లక్షల వ్యయంతో సుమారు 3600 మందికి నిత్యవసర కిట్లను అందించిన స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమన్నారు. నేటి యువతరం సమాజ సేవలో భాగస్వామ్యులు కావాలన్నారు. వరదల సమయంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధితులకు సహాయ సహకారాలను అందించామన్నారు. వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాయం అందించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వరదలను అడ్డం పెట్టుకొని బురద రాజకీయాలు చేసే విపక్షాల విమర్శలు వారి విజ్ఞతకేనన్నారు. పశ్చిమ నియోజకవర్గం లో చివరి వ్యక్తికి కూడా సంక్షేమం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. తెలుగుదేశం సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా చైర్మన్ మక్సుద్ అహ్మద్, వైస్ చైర్మన్ యెక్కల కౌశిక్, శ్రీకర్, నాదెళ్ల ఆదిత్య, మణ్హర్ సేది , అశ్విన్, సమీక్షసేధి, వినీల, అమూల్య, కాట్రగడ్డ మోహన్, సంపత్ కుమార్, శ్రీకాంత్, నాయకులు ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఊర్మిళ నగర్ మండల ప్రెసిడెంట్ పగడాల కృష్ణ, జనసేన 43వ డివిజన్ ప్రెసిడెంట్ బొల్లా పల్లి కోటేశ్వరరావు, టిడిపి డివిజన్ అధ్యక్షులు మోరబోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.