-అమ్మవారి భక్తులకు ఏర్పాటులలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా డ్రోన్ల సహాయంతో పర్యవేక్షిస్తూ పారిశుధ్య నిర్వహణ పక్కగా జరగాలని, దసరా మహోత్సవాలకి వచ్చిన అమ్మవారి భక్తులకు ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ అధికారుల ఆదేశించారు. గురువారం ఉదయం సీతమ్మ వారి పాదాలు, వినాయకుడి గుడి, రథం సెంటర్, అమ్మవారి గుడి పైకి కమిషనర్ ధ్యానచంద్ర వెళ్లి క్షేత్రస్థాయిలో దసరా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు.
గురువారం నుండి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు అధికం మొత్తంలో ఉంటారు కాబట్టి, అధికారులకు దిశ నిర్దేశాలిస్తూ అధికారులందరూ వారికి కేటాయించిన ప్రదేశాలలో నిరంతర పర్యవేక్షణలో సిబ్బందిని అప్రమత్తం చేస్తూ, భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు.
విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ విధిగా నిబంధనలు పాటించేలా చూడాలని అన్నారు.
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం డ్రోన్ల సహాయంతో పర్యవేక్షిస్తూ ఎక్కడైతే వ్యర్ధాలు ఎక్కువ ఉన్నాయో వాటిని డ్రోన్ తో కనిపెట్టి ఎప్పటికప్పుడు అధికారులను తెలియజేస్తే అధికారులు సత్వరమే సిబ్బంది చేత అవి త్వరితగతిన శుభ్రపరిచేటట్టు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విజయవాడ నగర పాలక సంస్థ ఏర్పాటుచేసిన ఉచిత తాత్కాలిక మరుగుదొడ్లు, క్లాక్ రూమ్స్, చెప్పుల స్టాండు, త్రాగునీరు ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లోటు లేకుండా, స్టాక్ ఉండేటట్టు చూసుకోవాలని, భవాని ఘాట్ పున్నమి ఘాటు స్నానాల ఘాటు దగ్గర పారిశుధ్య నిర్వహణలో లోపం ఎటువంటి లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.