జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం జిల్లా స్థాయి క్రీడల అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలోని గ్రామపంచాయతీలు మున్సిపాలిటీల ద్వారా మూడు శాతం స్పోర్ట్స్ సెస్ వసూళ్లపై సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీని ఆర్థికంగా పటిష్టం చేసేందుకు జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు నగరపాలక సంస్థల నుండి జీవో నెంబర్ 84 ద్వారా 3 శాతం స్పోర్ట్స్ సెస్ వసూల య్యేలా చూడాలని, తద్వారా జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. స్పోర్ట్స్ క్యాలెండర్ రూపొందించి ఆయా క్రీడల్లో ఈవెంట్స్ నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్య- కన్వీనర్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కే ఝాన్సీ లక్ష్మి, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయ ఏవో సీతారామయ్య పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రి పై భోగి పండ్లు కార్యక్రమం

ఇంద్రకీలాద్రి,  నేటి పత్రిక ప్రజావార్త : భోగి సందర్బంగా సోమ‌వారం దేవస్థానం మహమండపం 7 వ అంతస్తు నందు పెద్ద …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *