Tag Archives: AMARAVARTHI

బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలోని పలు జిల్లాలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి.. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో.. ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి..అయితే, ఈ రోజు, రేపు కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. 2-3 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రేపు ప్రకాశం జిల్లా, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడే …

Read More »

ఆషాఢ పూర్ణిమ వైశిష్ట్యం…గురు పూర్ణిమ వైశిష్ట్యం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్లో|| ఏకాక్షరప్రదాతారం, యో గురుం నాభిమన్యతే| స శ్వయోనిశతం గత్వా, చండాలత్వం అవాప్నుయాత్|| అన్నింటికంటే గురుద్రోహం మహాపాతకం. గురుద్రోహికి ప్రాయశ్చిత్తం చాలా కష్టం. ఒక్క అక్షరం లేక ఓంకారం, ఉపదేశంగా ప్రసాదించిన గురువును గౌరవించని పాపి వరుసగా నూరుజన్మలు కుక్కగా పుడతాడు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఆషాఢ శుక్ల ద్వాదశీ వ్రతం. ఆషాఢ శుక్ల ద్వాదశి నాడు ఉదయం లేచి శిరస్నానం చేసి గోపంచకంతో విప్రుల పాదాలు కడిగి, ఆపై శివాలయంలోని అర్చకునకు స్వయంపాకాదులు దానం చేస్తే, …

Read More »

26 జిల్లాల వ్యవసాయాధికారులతో వీడియో కాన్ఫరెన్సు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖకునూతన సంచాలకులు (డైరెక్టర్)గా బాధ్యతలు చేపట్టిన ఎస్. డిల్లిరావు IAS ఈరోజు అనగా 19-7-24 శుక్రవారం మొదట సారిగా రాష్ట్రంలోని 26 జిల్లాల వ్యవసాయాధికారులు, సహాయ వ్యవసాయ అధికారులు మరియు మండల వ్యవసాయాధికారులతో మంగళగిరి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాలలో వర్షాలుకురుస్తున్నప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు, వ్యవసాయసాగు పంటలు, సాధారణ వర్షపాతము, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, పంట కాల్వలలో నీటి లభ్యత తదితర విషయాలపై ఆరా తీసారు. …

Read More »

జస్టిస్ ఎవి రవీంద్రబాబు సేవలు ప్రసంశనీయం

-హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఎవి రవీంద్రబాబు అందించిన సేవలు ప్రసంశ నీయమైనవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందజేస్తున్న జస్టిస్ ఎవి రవీంద్రబాబు పదవీ విరమణ చేయనున్న నేపధ్యంలో శుక్రవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ వీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ …

Read More »

అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలా ప్రభుత్వ విజన్ ఉండాలి

-15 శాతం గ్రోత్ రేట్ సాధించడం ద్వారా తలసరి ఆదాయం రెట్టింపు అవుతుంది: సీఎం నారా చంద్రబాబు నాయుడు -వికసిత్ ఆంధ్రప్రదేశ్ – 2047 కోసం విజన్ డాక్యుమెంట్ పై నీతి ఆయోగ్ తో చర్చించిన ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలా ప్రభుత్వ విజన్ ఉండాలని ఏపీ సిఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ – 2047 కోసం విజన్ డాక్యుమెంట్ పై నీతి ఆయోగ్ తో చంద్రబాబు చర్చించారు. సచివాలయంలో …

Read More »

నెల్లూరు బారాషహీద్ దర్గా అభివృద్దికి రూ. 5 కోట్లు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు

-రొట్టెల పండుగకు వచ్చిన వారితో జూమ్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి -రాష్ట్రానికి మంచి జరిగేలా ప్రార్థించాలని భక్తులను కోరిన చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే నెల్లూరు రొట్టెల పండుగ కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా, వైభవంగా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. రొట్టెల పండుగ నిర్వహించే బారాషహీద్ దర్గాలో ప్రార్థనల నిర్మాణాలకు రూ. 5 కోట్లు మంజూరు చేసిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పండుగలో పాల్గొనే భక్తులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఉదయం 11 …

Read More »

భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష

-పూర్తి అప్రమత్తతతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులతో సీఎం రివ్యూ చేశారు. వర్షాలు అధికంగా ఉన్న ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్షించారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో ఉన్న తాజా పరిస్థితులపై అధికారులను …

Read More »

మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగుల సమావేశం

-సమస్యలు పరిష్కరించాలని టీడీ జనార్ధన్‌కు వినతి -సీఎం చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తామని టీడీ జనార్ధన్‌ హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొటిట్‌ బ్యూరో సభ్యులు టీడీ జనార్థన్‌ అధ్యక్షతన శుక్రవారం రిటైర్ట్‌ ఆర్మీ ఉద్యోగుల సమావేశాన్ని మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఏపీ స్టేన్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకరరావు, జనరల్‌ సెక్రటరీ వై. రమేష్‌కుమార్‌ …

Read More »

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి క్యూ కట్టిన వైసీపీ బాధితులు

-వైసీపీ అరాచకాలు, భూ-దోపిడీలు, అఘాయిత్యాలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి -ఐయిదు ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలను ఎంత హింసించారో అర్థమవుతోంది -బాధితులకు అండగా ఉంటాం.. తప్పకుండా ప్రతీ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాం -రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూఖ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలనుసారం గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాయలంలో రాష్ట్ర ముస్లిం మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూఖ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి …

Read More »

శ్రీకాకుళంలో క్రీడల పునరుజ్జీవనానికి ముందడుగు వేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కరణం మల్లీశ్వరి

-శ్రీకాకుళంలో ప్రపంచ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ స్థాపించాలని కోరిన రామ్మోహన్ నాయుడు, అంగీకరించిన కరణం మల్లీశ్వరి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒలింపిక్ పతక విజేత, దిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉప కులపతి కరణం మల్లీశ్వరితో, ఈ రోజు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో క్రీడల పునరుద్ధరణ గురించి, వెయిట్ లిఫ్టింగ్‌పై ప్రత్యేక అంశంగా ఇరువురి మధ్య చర్చ జరిగింది. శ్రీకాకుళంలో ప్రపంచ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ అకాడమీని నెలకొల్పాలని …

Read More »