Breaking News

Tag Archives: rajamendri

వసతి గృహాలను తనిఖీ చేసిన డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి ప్రత్యూష కుమారీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి పట్టణంలోని పలు సంక్షేమ వసతి గృహాలను మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా ప్రకాష్ నగర్ లోని కె.వి. స్టేట్ హోం ను సందర్శించి అక్కడ వసతులని పరిశీలించారు. అనంతరం బాల సదనమును సందర్శించి చిన్నారులతో మాట్లాడారు. వారికి అక్కడ అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉద్యోగినుల వసతి గృహమును సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. అనంతరం …

Read More »

వర్షం లో కమిషనర్ దినేష్ కుమార్ పర్యటన..

-వర్షాకాలం రాక ముందే కాలువల పూడిక తీత పనులు పూర్తి చేయాలని ఆదేశం. -డ్రైన్ ల రిపేర్లు ఉంటే తక్షణమే పూర్తి చేయండి. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచిపోయినట్టు అందిన సమాచారాన్ని తెలుసుకొని కమిషనర్ కె. దినేష్ కుమార్ హుటాహుటిన ఆ ప్రాంతాలను సందర్శించారు . నల్ల ఛానల్, కంబాలచెరువు, హైటెక్ బస్టాండ్ ,కృష్ణా నగర్ మున్నగు ప్రాంతాల ను సందర్శించి సానిటరీ వర్కర్ల ను అప్రమత్తం చేసి …

Read More »

హోటల్స్ ట్రేడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి…

-జిల్లా పర్యాటక అధికారి పి.వెంకటాచలం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : హోటల్స్ ట్రేడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా పర్యాటక అధికారి పి.వెంకటాచలం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హోటల్స్, లాడ్జిలు, రెస్టారెంట్లు, వెల్నెస్ సెంటర్లు.. ట్రావెల్ ఆపరేటర్స్ అందరూ ట్రేడ్ రిజిస్ట్రేషను చేసుకోవాలని పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ట్రేడ్ రిజిస్ట్రేషను చేయించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫికేట్ తో పాటు, కేంద్ర ప్రభుత్వ సాతి – నిధి ఇవ్వడం జరుగుతుందని, ఈ సర్టిఫికెట్ పొందిన వారికి ఏర్యాటక ప్రయోజనాలు చేకూరుతాయని …

Read More »

విభిన్న ప్ర‌తిభావంతుల హ‌క్కుల చ‌ట్టం-2016

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న ప్ర‌తిభావంతుల హ‌క్కుల చ‌ట్టం-2016 ప‌టిష్ట అమ‌లుకు రెవెన్యూ, పోలీస్‌, విభిన్న ప్ర‌తిభావంతులు, విద్య‌, వైద్యం, గ్రామీణాభివృద్ధి, ఐసీడీఎస్ త‌దిత‌ర స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు కృషిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. K. మాధవీలత ఆదేశించారు. సోమవారం కలెక్టర్ గారి ఛాంబర్ నందు విభిన్న ప్ర‌తిభావంతుల హ‌క్కుల చ‌ట్టం-2016, చ‌ట్టం ప‌టిష్ట అమ‌లుకు రాష్ట్ర ప్ర‌భుత్వం రూపొందించిన నియ‌మావ‌ళి అమ‌లుపై స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాధవీలత మాట్లాడుతూ …

Read More »

కోతలు ప్రారంభించని రైతులు వర్షాలు తగ్గే వరకు ఆగండి

-వర్షం కారమంగా ఆర్బీకేల్లో మిగిలిన ధాన్యం ఆఫ్ లైన్ లో కొనుగోలు చేస్తాం -వ్యవసాయ, రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులు మధ్య సమన్వయం -కొనుగోళ్ల విషయంలో అవకతవకలు జరిగినట్లు తెలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం -అధికారులతో, మిల్లర్ల ప్రతినిధులతో అత్యవసర భేటీ -కలెక్టర్ మాధవీలత, జేసీ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు రైతులను అప్రమత్తం చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ లు అధికారును ఆదేశించారు. సోమవారం …

Read More »

న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు మరియు కార్మిక శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం స్థానిక విక్రమ హాల్ నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె.ప్రత్యూష కుమారి కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులు వారి హక్కులు మరియు సంక్షేమం కోసం చేయబడ్డ చట్టాల …

Read More »

సోమవారం మే 1 వ తేదీ జిల్లా కలెక్టరేట్లో స్పందన

-ఇకపై ప్రతి సోమవారం ఆర్డీవో రాజమహేంద్రవరం లో స్పందన ఆర్జీల స్వీకరణ -కలెక్టర్ డా కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే  జిల్లా, డివిజన్, మండల, గ్రామ  స్థాయి స్పందన కార్యక్రమం మే 1 వ తేదీ సోమవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, అదేవిధంగా డివిజన్ రాజమహేంద్రవరం, కొవ్వూరు రెవెన్యూ డివిజన్ అధికారుల కార్యాలయం లతో పాటుగా, మండల, గ్రామ స్థాయి, …

Read More »

తుది దశకు పుష్కర్ ప్లాజా పనులు

-నగరంలో మరో పర్యాటక ప్రదేశంగా పుష్కర్ ప్లాజా -దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ పరిధిలో కొత్తగా రూపుదిద్దుకుంటున్న పుష్కర్ ప్లాజా సందర్శించి, జరుగుతున్న పనులని శనివారం పరిశీలించడం జరిగిందని నగర పాలక సంస్థ కమీషనర్ కే.దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భం కమిషనర్ కె. దినేష్ కుమార్ పుష్కర్ ప్లాజా ప్రాంతంలో చేస్తున్న పనులలో నాణ్యత పాటించాలని ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టరుకు సూచినలు చేశారు. నగరంలో ప్రధాన ప్రాంతంలో కేంద్రీకృతం అయిన పుష్కర్ ఘాట్ రైల్వే అండర్ …

Read More »

రెడ్ క్రాస్ సొసైటీ కి రూ.3 లక్షలు విరాళాలు అందించిన బి.తాతారావును అభినందించిన కలెక్టర్

-సమాజ సేవలో రెడ్ సేవలు ఆదర్శం -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు ప్రతి ఒక్కరూ తమ స్థాయి కి తగిన విధంగా సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పిలుపు నిచ్చారు. బుధవారం సాయంత్రం వెంకటేశ్వరట్రావెల్స్ అధినేత, బీమా జూవలరీస్ బిల్డింగ్ యజమాని బి.తాతారావు కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ మాధవీలతను కలసి తన వంతు సహాయంగా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కి రూ.3 లక్షల రూపాల విరాళం చెక్కు ను …

Read More »

అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చి వేయండి..

-నగరం లో పలు నిర్మాణాలు ఆకస్మిక తనిఖీ. -కమిషనర్ దినేష్ కుమార్.. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ కె దినేష్ కుమార్ నగరం లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై నియంత్రణ లేకపోవడం పై బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మహావీర్ స్ట్రీట్, మెరక వీధి,ఇన్నీస్ పేట, గైయిల్ ఆఫీస్ వద్ద జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఈ ఉదయం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న కట్టడాలను తక్షణమే కూల్చివేయాలని టౌన్ ప్లానింగ్ అధికారుల ను ఆదేశించారు. …

Read More »