Breaking News

తుది దశకు పుష్కర్ ప్లాజా పనులు

-నగరంలో మరో పర్యాటక ప్రదేశంగా పుష్కర్ ప్లాజా
-దినేష్ కుమార్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ పరిధిలో కొత్తగా రూపుదిద్దుకుంటున్న పుష్కర్ ప్లాజా సందర్శించి, జరుగుతున్న పనులని శనివారం పరిశీలించడం జరిగిందని నగర పాలక సంస్థ కమీషనర్ కే.దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భం కమిషనర్ కె. దినేష్ కుమార్ పుష్కర్ ప్లాజా ప్రాంతంలో చేస్తున్న పనులలో నాణ్యత పాటించాలని ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టరుకు సూచినలు చేశారు. నగరంలో ప్రధాన ప్రాంతంలో కేంద్రీకృతం అయిన పుష్కర్ ఘాట్ రైల్వే అండర్ బ్రిడ్జి పక్కన ఉన్న ఈ స్థలం , రహదారి ప్రాంతాన్ని నిరుపయోగంగా ఉంటూ జనావాసాలు లేని ప్రాంతంగా ఉండడం తో ఇలాంటి ప్రదేశాన్ని పుష్కర్ ఘాట్ వద్దకు వచ్చే పర్యాటకులకు కూర్చొనే విధంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే పనులు దాదాపు అన్ని పనులు తుది దశకు వచ్చాయన్నారు. నగర ప్రజలకు , పర్యాటకులకు అహల్లదం కల్పించే దిశలో రోజుల్లో పుష్కర్ ప్లాజాను ప్రారంభిస్తామని ఆయన తెలియజేసారు. ఈ కార్యక్రమం లో సూపరింటెండెంట్ ఇంజనీర్ జి. పాండు రంగారావు, సంబంధిత ఇంజినీర్లు , పి.ఎం.యూ టీం సభ్యులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *