-మే 5 న వాలంటీర్ కు వందనం కార్యక్రమం
-కొవ్వూరు కె జి ఎం హై స్కూల్ ప్రాంగణంలో హెలిప్యాడ్
-2.1 కి మీ మేర ముఖ్యమంత్రి రోడ్ షో
-రోడ్ షో కు చెందిన ఐదు కుడళ్ళల్లో వైద్య శిబిరాలు
-వేసవి దృష్ట్యా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి .. త్రాగునీటి వ్యవస్థ, అంబులెన్స్ సిద్దంగా ఉంచాలి
-కలెక్టర్ కె.మాధవీలత, జెసి తేజ్ భరత్
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మే 5 వ తేదీ శుక్రవారం కొవ్వూరులో “వాలంటీర్ కు వందనం” రాష్ట్ర స్థాయి వేడుకలు అత్యంత పటిష్టంగా నిర్వహించడంలో శాఖల మధ్య సమన్వయం సాధించడం ముఖ్యం అని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు.
శనివారం స్థానిక కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో సిఎం పర్యటన పై జిల్లా, డివిజన్, మండల వారిగా ముందస్తు కార్యాచరణ పై కలెక్టర్ కె.మాధవీలత, జేసీ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జీ. నరసింహం లతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి మే 5 వ తేదీ న ” వాలంటీర్ కు వందనం ” కార్యక్రమంలో , ముఖ్య అతిథిగా హాజరు కానున్నరన్నారు. ఈ పర్యటన విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ నిబద్దత తో కూడి పని చేసే క్రమంలో సమన్వయం ఉండాలన్నారు. జిల్లా ఏర్పాటు చేసిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు రావడం ఏడోవసారి అన్నారు. జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవడం ద్వారా ఆయా పర్యటన లను విజయవంతంగా నిర్వహించుకో గలమన్నారు. మే 5 న జరుపుతున్న వాలంటీర్ కు వందనం కార్యక్రమాన్ని అదే తరహాలో విజయవంతం చెయ్యాల్సి ఉందన్నారు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను ప్రజలకు క్రమ పద్ధతిలో సకాలంలో చేరువ చెయ్యడంలో వాలంటీర్ల యొక్క పాత్ర ప్రధానమైనదన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా మెరుగైన పౌర సేవలు అందచేసే క్రమంలో రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ తీసుకుని రావడం జరిగిందన్నారు. అటువంటి వాలంటీర్ సేవల గుర్తింపు గా వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేసవి దృష్ట్యా తగిన మెడికల్ క్యాంపులు, అత్యవసర మందులు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు సిద్దం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆర్టీసి, రవాణా శాఖ అధికారులు తగిన వాహనాలు సిద్దం చేసుకొని ఆయా మండలాలకు ముందస్తుగా రూట్ మ్యాప్ మేరకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ వేసవి దృష్ట్యా రోడ్ షో, బహిరంగ సభ వద్ద తగిన 108 అంబులెన్స్ వాహనాలు, మెడికల్ క్యాంపు, మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచాలన్నారు. ఆయా నియోజకవర్గాల వారీగా స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. సిఎం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న రోడ్ షో కు ఎటువంటి ఆటంకం కలుగకుండా ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని స్పష్టం చేశారు.
ఆధ్వర్యంలో సిఎం బహిరంగ సభకు హాజరు కానున్న స్వయం సహాయక సంఘాలు, వాలంటీర్ లతో సమన్వయం సాధించడం ముఖ్యం అన్నారు.
ఈ సమావేశంలో డి ఆర్వో జీ. నరసింహులు, ఆర్డీవో లు ఎస్. మల్లి బాబు, ఏ. చైత్ర వర్షిణి, డిసిహెచ్ఒ డా. ఎమ్. సనత్ కుమారి, సీపీఓ కె.ప్రకాష్ రావు, డ్వామా పీ డి జిఎస్ రామగోపాల్, డి. పి. ఓ, పి. జగదాంబ, జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి, కే.కృష్ణా రావు, డి ఎల్ డిఓ పి. వీణా దేవి, డీఎస్ ఓ పి. ప్రసాద రావు, పలువురు జిల్లా శాఖా అధికారులు , తది తరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News