Breaking News

బాబామందిరం ఆధ్వర్యంలో పదవతరగతి విద్యార్థులకు ఫీజుల సాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ లో టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులకు ఫీజులు (చెక్కు రూపంలో) మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి చేతుల మీదుగా స్కూల్ ఉపాద్యాయులకు చిరు సన్మానం అనంతరం చెక్కులు అందజేసారు.
ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర షిరిడిగా పేరుగాంచిన ముత్యాలంపాడు బాబా మందిరం ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పదమూడు నగర పాలక సంస్థ పాఠశాలలను గుర్తించి పదవతరగతి చదువుతున్న విద్యార్థుల అందరికీ పరీక్ష ఫీజులు గత పద్దెనిమిది సంవత్సరాలుగా నిర్విరామంగా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం చెల్లిస్తున్నామని ఈ పందొమ్మిదో ఏడాది పన్నెండు వందల డబ్బై ఐదు మంది విద్యార్థి విద్యార్థినులకు లక్ష అరవై వేల రూపాయలు ఫీజులు చెల్లిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం తలపెట్టడానికి కారణం పాఠశాలలో చదువుతున్న ఇరవై మంది మెరిట్ విద్యార్థులను ఎంతవరకు చదివితే అంతవరకు విద్యను అందించాలని అనుకున్నామని స్కూల్ ఉపాధ్యాయులని కలిసి మాట్లాడిన తర్వాత వారూ మా దృష్టికి తెచ్చిన అంశం ప్రతిభ గల విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫీజులు కూడా కట్టలేక స్కూల్లో డ్రాపౌట్స్ పెరుగుతున్న పరిస్థితులు ఉన్నాయని తెలియజేశారని,బాబా వారి ఆశీస్సులతో ఏకేటిపిఎం స్కూల్లో మొదటిసారిగా నగర పాలక సంస్థ పాఠశాలవిద్యార్థులకు మేము ఈ పరీక్ష ఫీజులు చెల్లించడం మొదలు పెట్టడం జరిగిందన్నారు.19 సంవత్సరాల నుండి నిర్విరామంగా పరీక్ష ఫీజులు చెల్లిస్తున్నానుమాన్నారు.గత సంవత్సరం మున్సిపల్ హైస్కూల్లో చదివిన విద్యార్థులకు ఐదు వందల తొంబై నాలుగు మార్కులు రావడం విద్యార్థులందరూ మంచి మార్కులతో పాస్ అవడానికి మేము భాగస్వాములు అవడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థులకు మెరుగైన ఫలితాలు రావడానికి కృషి చేసిన ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో మందిర అధ్యక్షులు పి లక్ష్మణరావు, కోశాధికారి మందలవర్తి సత్య శ్రీహరి,మందిర సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సంక్రాంతి సంబరాలను విజయవంతం చేయడానికి కృషి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో తెలుగు సంప్రదాయాలను నేటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *