Breaking News

గవర కార్పొరేషన్‌ చైర్మన్‌గా మల్ల సురేంద్ర ప్రమాణ స్వీకారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర కార్పొరేషన్‌ చైర్మన్‌గా మల్ల సురేంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం విజయవాడ గొల్లపూడి బీసీ భవన్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర కార్పొరేషన్‌ చైర్మన్‌గా మల్ల సురేంద్ర ప్రమాణ స్వీకార మహోత్సవం బీసీ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ భీమ్‌ శంకర్రావు జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఏ ఎస్‌ యు బి సి డి ఉమాదేవి సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా మల్ల సురేంద్ర మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో మొదట నుండి గవర జాతీయుల్ని రాజకీయంగా గుర్తిస్తుంది తెలుగుదేశం పార్టీ అని, గవర కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించినందుకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి, మరియు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కి, బిజెపి అధ్యక్షులు పురందేశ్వరికి ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, అర్బన్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పీలా గోవింద్‌ సత్యనారాయణ, అనకాపల్లి పార్లమెంట్‌ సభ్యులు సీఎం రమేష్‌ సోదరులు సీఎం రాజేష్‌, మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి, చోడవరం శాసనసభ్యులు కే ఎస్‌ ఎన్‌ రాజు, పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్‌బాబు, రాష్ట్ర హౌసింగ్‌ బోర్డ్‌ చైర్మన్‌ బొత్తుల తాతయ్య బాబు, ఎస్‌ కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయనా, పార్వతీపురం ఎమ్మెల్యే బోనాల విజయ్‌చంద్ర, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రాష్ట్ర రోడ్లు అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రగాఢ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు పార్వతీపురం ఎమ్మెల్యే బోనాల విజయ్‌ చంద్ర, అనకాపల్లి జనసేన ఇన్చార్జ్‌ బేమరిశెట్టి రాంకి, అరుకు టిడిపి ఇన్చార్జ్‌ దన్ను దొర, మరియు కూటమి పార్టీ నాయకులు, తదితరులు అధిక స్థాయిలో పాల్గొని చైర్మన్‌ మల్ల సురేద్రకి శుభాకాంక్షలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *