విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పి.వి.జి.కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం విజయవాడ గొల్లపూడి బీసీ భవన్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పి.వి.జి.కుమార్ తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పి.వి.జి.కుమార్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొప్పుల వెలమ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌కి పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బాధ్యతగా నిర్వహిస్తానని అన్నారు. గత ప్రభుత్వం వెలమ సంక్షేమ విషయంలో కాలయాపన చేసిందని అన్నారు. ఇప్పుడు అది కొనసాగకుండా కొప్పుల వెలమ సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యేలు, ప్రముఖులు పి.వి.జి.కుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News