విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేసిన సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ అభినందనలు తెలియజేశారు. విజయవాడ గురునానక్కాలనీ నాక్ కళ్యాణమండపంలో శుక్రవారం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ వెనిగండ్ల రాముకు రావి వెంకటేశ్వరరావు వెన్నంటి ఉండి పార్టీ విజయానికి కృషి చేశారని కొనియడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావికి సముచిత స్థానం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News