-ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి..
-తప్పిదాలకు తావులేని ఓటర్ల జాబితా తయారీ పై దృష్టి సారించాలి.
-పశుసంవర్ధక శాఖ కార్యదర్శి, ఓటర్ల జాబితా అబ్జర్వర్ ఎం.ఎం. నాయక్..
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటరు జాబితాను దోషరహితగా రూపొందించడంలో సంబంధిత అధికారులు దృష్టి సారించాలని రాష్ట్రపశుసంవర్ధక శాఖ కార్యదర్శి, ఓటర్ల జాబితా అబ్జర్వర్ ఎం.ఎం. నాయక్ అన్నారు. సోమవారం సాయంత్రం స్ధానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతితో కలిసి ఎస్ ఎస్ ఆర్ 2025 ఓటర్ల జాబితా స్వచ్చీకరణపై ఈఆర్ఓలు, నోడల్ అధికారులతో ఆయన సమీక్షించారు. అబ్జర్వర్ ఎం.ఎం. నాయక్ కు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా అబ్జర్వర్ ఎం.ఎం. నాయక్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కు ఓటర్ల జాబితా ఎంతో కీలకమైనదని అటువంటి జాబితా రూపకల్పనలో ఎటువంటి తప్పులకు తావులేకుండా స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు పకడ్బందీగా ఓటర్ల జాబితా స్కూట్ని చేయాలన్నారు. రానున్న నెల రోజుల సమయంలో ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బిఎల్ఓ లతో ఇఆర్ఓలు సమావేశం నిర్వహించాలని చెప్పారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబిత రూపకల్పనకు బిఎల్ఓల సేవలను వినియోగించు కోవాలన్నారు. జిల్లాలో 18-20 సంవత్సరాల వయస్సు కలిగిన యువత ను ముఖ్యంగా డిగ్రీ కళాశాల విద్యార్ధు లను నూతన ఓటర్లుగా చర్పించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఓటర్ల జాబితా లో లాజికల్, డెమోగ్రాఫికల్ పొరపాట్లు ఉంటే వాటిని పూర్తిస్ధాయిలో సవరించాలన్నారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా కార్యక్రమంలో ఓటర్ల తొలగింపు సమయంలో ఒకటికి రెండుసార్లు క్షుణంగా పరిశీలించాలన్నారు. ఓటర్ల జాబితా తయారీ సమయంలో ఇపి రేషియో, జండర్ రేషియో అంశాల్లో ఉన్న వ్యత్యాసాలను పరిశీలించుకోవాలన్నారు. ఓటరుగా నమోదు, సవరణకు అర్హులైన వారు ఎవరైనా సరే ఫారం 6, 7, 8 ధరఖాస్తు ఫారాలను భర్తీ చేసి అందజేయాలన్నారు. ఓటరు నమోదు కార్యక్రమంలో రాజకీయపక్షాల ప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడూతూ జిల్లాలో 2025 ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా అంశాలను వివరించారు. జిల్లాలో ఒక పార్లమెంట్ నియోజకవర్గం, 7 అసెంబ్లీ నియోజవర్గాలులో మూడు అర్బన్, 18 మండలాలు ఉన్నాయని, 7 మంది ఇఆర్ఓలు ఉన్నారన్నారు. ఓటరు జాబితా కు సంబంధించి అక్టోబరు 29 నాటికి 16,20,636 మంది ఓటర్లుగా నమోదైవుందన్నారు. వారిలో 7,91,086 మంది పురుషులు ఉండగా 8,29,456 మంది మహిళలు, 124 మంది ఇతరులు ఉన్నారన్నారు. జిల్లాలో 1581 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని వాటన్నింటిని పరిశీలించడం జరిగిందన్నారు. జిల్లాలో 2025 ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఈనెల 9,10 మరియు 23, 24 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు నిర్వహించామన్నారు. డిశంబరు 24 నాటికి క్లైయిమ్ లు అభ్యంతరాలను పరిష్కరించడం పూర్తిచేస్తామన్నారు. తుది జాబితాను 2025 జనవరి 6 వ తేదీన ప్రకటించడం జరుగుతుందన్నారు. జిల్లాలో తీసుకున్న ప్రత్యేక కార్యక్రమాలు ద్వార 18-19 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారిని ఓటర్లుగా నమోదు చేస్తున్నా మన్నారు .
సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, జిల్లా రెవిన్యూ అధికారి టి. సీతారామమూర్తి, ఆర్డిఓ కృష్ణ నాయక్, రాణి సుస్మిత, ఆర్ వి రమణ నాయక్, కే ఎల్. శివ జ్యోతి, కె. సరళ వందనం, ఎమ్..మాధురీ, డిఆర్డిఏ పిడి ఎన్ వి ఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News