Breaking News

నారావారి పల్లి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

-నారావారి పల్లి నందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి స్వాగతం పలికిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని

నారావారి పల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలలో పాల్గొనడానికి బుధవారం రాత్రి 7.25 గంటలకు చంద్రగిరి మండలం,నారావారి పల్లి గ్రామానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోదరుడు చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలు గురువారం ఉదయం నారావారి పల్లి ముఖ్యమంత్రి స్వగృహం నందు నిర్వహించే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మ క్రియలలో పాల్గొనడానికి నారావారి పల్లి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చంద్రగిరి ఎమ్మెల్యే తో పాటు మాజీ ఎమ్మెల్యే ఎస్. సి. వి. నాయుడు ప్రజా ప్రతినిధులు గ్రామస్థులు స్వాగతం పలికారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *