డిసెంబర్ 2న జరగబోవు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పెండింగ్ ద్వైపాక్షిక అంశాలపై నిర్వహించనున్న అధికారుల కమిటీ తొలి సమావేశం ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్ ప్రసాద్, శాంతి కుమారి డిసెంబర్ 2న జరగబోవు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పెండింగ్ ద్వైపాక్షిక అంశాలపై నిర్వహించనున్న అధికారుల కమిటీ తొలి సమావేశం ఏర్పాట్లు పక్కాగా ఉండాలని విధులు కేటాయించబడిన అధికారులు అప్రమత్తంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు.

శనివారం మధ్యాహ్నం స్థానిక జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులుతో కలిసి కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ ఈ నెల డిసెంబర్ 2న జరగబోవు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పెండింగ్ ద్వైపాక్షిక అంశాలపై నిర్వహించనున్న అధికారుల కమిటీ తొలి సమావేశం ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇరు రాష్ట్ర ఉన్నతాధికారుల సంయుక్త సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉమ్మడి ఆం.ప్ర రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొననున్నారని అన్నారు. సదరు సమావేశం శ్రీ పద్మావతి అతిథి గృహం తిరుపతి నందు నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, లైజన్ అధికారులు వారికి కేటాయించబడిన ఐఏఎస్ ఉన్నతాధికారుల రిసెప్షన్, వసతి తదితర ప్రోటోకాల్ విధులను, ఇతర విధులు కేటాయించబడిన అధికారులు వారి విధులను జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో ఇంధన శాఖ, ఆర్థిక శాఖ, కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కార్మిక మరియు ఫ్యాక్టరీల శాఖ,రెవెన్యూ (ఎక్సైజ్) హోంశాఖ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారని తెలిపారు. ఇందులో ఉమ్మడి ఆం.ప్ర రాష్ట్రానికి చెందిన సుమారు 20 మంది ఐఏఎస్ 4 ఐపీఎస్ అధికారులు, సెక్రటేరియట్ అధికారులు తదితరులు పాల్గొననున్నారు అని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రి పై భోగి పండ్లు కార్యక్రమం

ఇంద్రకీలాద్రి,  నేటి పత్రిక ప్రజావార్త : భోగి సందర్బంగా సోమ‌వారం దేవస్థానం మహమండపం 7 వ అంతస్తు నందు పెద్ద …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *